కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) అనూహ్యంగా అమేథీ(Amethi)ని వదిలిపెట్టేసి రాయబరేలీ(Raebareli)ని ఎంచుకున్నారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నుంచి రాహుల్ అంతగా ఆసక్తి చూపడం లేదు. నిన్నటి వరకు ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారనే అనుకున్నారు చాలా మంది.

Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) అనూహ్యంగా అమేథీ(Amethi)ని వదిలిపెట్టేసి రాయబరేలీ(Raebareli)ని ఎంచుకున్నారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నుంచి రాహుల్ అంతగా ఆసక్తి చూపడం లేదు. నిన్నటి వరకు ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారనే అనుకున్నారు చాలా మంది. కానీ ఆయన పెద్ద ట్విస్ట్ ఇస్తూ రాయబరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కొద్ది సేపటి కింద కాంగ్రెస్ పార్టీ రాయబరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ( Kishori Lal Sharma)ను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సమయంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇక ప్రియాంకగాంధీ పోటీకి దూరం అయినట్టే అనుకోవాలి.
