అమెరికా(America) ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్(Congress) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీజేపీ(BJP) ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. పరువు నష్టం కేసులో తనకు ఇంత పెద్ద‌ శిక్ష పడుతుందని.. ఎంపీగా అనర్హత వేటు వేస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.

అమెరికా(America) ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్(Congress) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీజేపీ(BJP) ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. పరువు నష్టం కేసులో తనకు ఇంత పెద్ద‌ శిక్ష పడుతుందని.. ఎంపీగా అనర్హత వేటు వేస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. కాలిఫోర్నియాలోని(California) ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ(Stanford University) క్యాంపస్‌లో జరిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "నేను నా పార్లమెంటు(Parliament) సభ్యత్వాన్ని కోల్పోయాను.. కానీ అది నాకు పని చేయడానికి చాలా అవకాశం ఇచ్చింది. నేను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకునే పవిత్రమైన స్వతంత్ర సంస్థల గురించి మాట్లాడుతున్నాను. వాటి పాత్రను ఖచ్చితంగా నిర్వ‌ర్తించాల‌ని మాట్లాడుతున్నానని అన్నారు.

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ గురించి చాలా విన్నానని చెప్పారు. మాజీ ఎంపీగా తన పరిచయాన్ని ప్రస్తావిస్తూ.. నాపై అనర్హత వేటు పడే వరకు నేను పార్లమెంటు సభ్యుడిని అని పీఠికలో విన్నాను. పరువు నష్టం జరిగితే ఇంత పెద్ద‌ శిక్ష పడుతుందని, నన్ను అనర్హుడిగా ప్రకటిస్తారని నేను ఊహించలేదని ఆయన అన్నారు. పరువునష్టం కేసులో శిక్ష విధించడం మొదట ఆశ్చర్యానికి గురిచేసిందని.. అయితే ఇది రాజకీయమని అన్నారు. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రయోజనం కలిగిందని, ఇప్పుడు ప్రజలతో మమేకమై పని చేస్తున్నానన్నారు. భారతదేశంలోని మొత్తం ప్రతిపక్షాలు సంస్థాగత ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని, దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అందరూ పోరాడుతున్నారని అన్నారు.

Updated On 1 Jun 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story