రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పు సరైనదేనని.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాహుల్ చేసిన ఈ దరఖాస్తును అంగీకరించలేమని..
రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ(Modi) ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పు సరైనదేనని.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాహుల్ చేసిన ఈ దరఖాస్తును అంగీకరించలేమని.. అందుకే తిరస్కరించినట్లు కోర్టు తెలిపింది. రాహుల్ గాంధీపై కనీసం 10 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు పేర్కొంది.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ జిల్లా కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. మేలో కూడా రాహుల్ గాంధీకి రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత తుది తీర్పును వెలువరిస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే తీర్పు వెలువరించింది.