నీట్ పేపర్ లీక్ అంశంపై వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో తీవ్ర దుమారం చెలరేగింది.

నీట్ పేపర్ లీక్ అంశంపై వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల సమస్యపై ప్ర‌భుత్వం ఏమీ చేయడం లేదని.. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి విప‌క్షాల‌పై ఎదురుదాడికి దిగారు. నీట్ పరీక్ష చరిత్రను గురించి రాహుల్‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. విద్యా సంస్కరణల కోసం 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆయన ప్ర‌స్తావించారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

భారత పరీక్షా విధానం మోసంతో నిండిపోయిందని రాహుల్ అన్నారు. ధనవంతులై డబ్బు ఉంటే భారతీయ పరీక్షా విధానంలో పేప‌ర్లు కొనుగోలు చేయవచ్చని మిలియన్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. నీట్ వ్యవస్థ పొరపాటే అయితే సరిదిద్దేందుకు ఏం చేశారన్నారు. మంత్రి తనను తాను తప్ప.. అందరినీ తప్పుబడుతున్నారు. దేశంలో ఏం జరుగుతుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

దేశంలోని పరీక్షా విధానాన్ని విపక్ష నేత త‌ప్పుప‌ట్ట‌డాన్ని విద్యాశాఖ మంత్రిగా నేను ఖండిస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రిమోట్‌గా ప్రభుత్వాన్ని ఎవరు నడిపారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి కపిల్ సిబల్ విద్యా సంస్కరణలకు సంబంధించి మూడు బిల్లులు తీసుకొచ్చారు.

ఉన్నత విద్యా సంస్థల్లో క్యాపిటేషన్ ఫీజులు డిమాండ్ చేయడం.. అర్హత లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం.. ఫీజు రసీదులు ఇవ్వకపోవడం.. విద్యార్థులను తప్పుదోవ పట్టించడం వంటి అన్యాయమైన పద్ధతులు ఇందులో ఉన్నాయని ఎదురుదాడి చేశారు. మమ్మల్ని ప్రశ్నలు అడగండి. పరీక్షా విధానాన్ని మెరుగుపరచడంతోపాటు ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యాన్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సంస్కరణలు జరుగుతున్నాయన్నారు.

ఈ అంశంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. పేపర్ లీక్‌లో ఎన్డీఏ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందని అన్నారు. రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన కేంద్రాలు చాల ఉన్నాయన్నారు. ధర్మేంద్ర విద్యాశాఖ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం విద్యార్థులకు న్యాయం జరగదన్నారు.

Eha Tv

Eha Tv

Next Story