కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను టార్గెట్ చేశారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం కింద భారత్ మొబైల్ ఫోన్‌లను తయారు చేయడం లేదని
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శనివారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan)ను టార్గెట్ చేశారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం కింద భారత్ మొబైల్ ఫోన్(Mobile Phones)లను తయారు చేయడం లేదని.. వాటిని అసెంబ్లింగ్ మాత్రమే చేస్తోందని రాజన్ చేసిన ప్రకటన నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు.. వారు తమ ఆర్థిక భావాన్ని కోల్పోతారని వైష్ణవ్ అన్నారు. రఘురామ్ రాజన్ నాయకుడిగా మారారు. రాజన్ రాజకీయాల్లోకి బహిరంగంగా రావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలని, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. వెన్నుపోటు పొడవడం మంచిది కాదని.. మరొకరి కోరిక మేరకు ఆయన అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రఘురామ్‌రాజన్ దాడి సరికాదని అన్నారు. ఆయన చాలా నిష్ణాతుడైన ఆర్థికవేత్త. ఉంటే ఆయన ఆర్థికవేత్తగా ఉండాలి లేదా రాజకీయ నాయకుడిగా మారాలని నేను ఆయనను అభ్యర్థిస్తున్నానని అన్నారు.
వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ 30 శాతానికి పైగా అదనపు విలువను సాధిస్తుందన్నారు. మూడు కంపెనీలు త్వరలో ప్రపంచానికి కీలకమైన మొబైల్ ఫోన్ భాగాలను భారత్‌లో తయారు చేయనున్నాయని తెలిపారు. నేడు ప్రపంచ సరఫరా గొలుసు చాలా క్లిష్టంగా ఉందని.. ఏ దేశం కూడా 40 శాతానికి మించి విలువ జోడింపును క్లెయిమ్ చేయలేదని మంత్రి అన్నారు.
గత ఏడాది జరిగిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో మాజీ ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. రాజస్థాన్(Rajasthan)లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెంట నడిచారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ సీనియర్ ఆర్థికవేత్తలను కూడా ఇంటర్వ్యూ చేశారు. దీంతో రాజన్ కామెంట్స్ కాషాయ పార్టీ(BJP)కి నచ్చలేదు.