ప్రముఖ రేడియో ప్రెజెంటర్‌ అమీన్‌ సయానీ(Ameen Sayani) గుండెపోటుతో(Heart attack) చనిపోయారు. ఓ తరంవారికి ఆయనంటే అమితమైన అభిమానం. ఆయన వ్యాఖ్యానంతో సాగిన బినాకా గీత్‌ మాలా(Binaka Geet Mala) చాలా పాపులర్‌. ఆయకు ఈ కార్యక్రమం ఎంతగానో పేరు తెచ్చింది.90 ఏళ్ల వయసున్న అమీన్‌ సయానీకి మంగళవారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.

ప్రముఖ రేడియో ప్రెజెంటర్‌ అమీన్‌ సయానీ(Ameen Sayani) గుండెపోటుతో(Heart attack) చనిపోయారు. ఓ తరంవారికి ఆయనంటే అమితమైన అభిమానం. ఆయన వ్యాఖ్యానంతో సాగిన బినాకా గీత్‌ మాలా(Binaka Geet Mala) చాలా పాపులర్‌. ఆయకు ఈ కార్యక్రమం ఎంతగానో పేరు తెచ్చింది.90 ఏళ్ల వయసున్న అమీన్‌ సయానీకి మంగళవారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఏడు గంటల సమయంలో అమీన్‌ కన్నుమూశారు. సిలోన్‌ రేడియోలో బినాకా గీత్‌ మాలా ప్రసారవుతున్నప్పుడు రోడ్లు నిర్మానుష్యమయ్యేవంటే అతిశయోక్తి కాదు. అందరి ఇంట్లో ఈ ప్రోగ్రామే వినిపిస్తూ ఉండేది. నమస్కార్ భాయి యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్ అంటూ రేడియోలో తనను తాను పరిచయం చేసుకునేవారు. ఇదే ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే గాక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన డిసెంబర్ 21, 1932న ముంబైలో సాహితివేత్తల కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిగారు జాతీయోద్యమంలో మహాత్మాగాంధీతో కలిసి పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధురాలు కూడా! సోషల్‌ యాక్టివిస్ట్‌. కాగా,అమీన్‌ సయానీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.ఓ లెజెండర్‌ స్వరం మన నుంచి దూరమయ్యిందని రాజ్‌దీస్‌ సర్దేశాయ్‌ అన్నారు.
బినాకా గీత్ మాలా, బోర్న్‌ విటా క్విజ్‌ వంటి కార్యక్రమాల్లో అమీన్‌ తన గాత్రంతో ప్రేకక్షులకు అలరించారు. అంతేగాక 50 వేలకు పైగా రేడియో షోలు చేశారు.

Updated On 21 Feb 2024 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story