Qatar Court : ఖతార్‌లో నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట!
భారత(Bharat) నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు(Qatar Court) అనుమతించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల(Navy Officials) కుటుంబాలకు ఈ సమాచారం అందినట్టు జాతీయ మీడియా(National Media) తెలిపింది. ఇండియా అప్పీల్‌ను ఖతార్ కోర్టు అంగీకరించిందని, అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జాతీయ మీడియా పేర్కొంది.
భారత(Bharat) నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు(Qatar Court) అనుమతించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల(Navy Officials) కుటుంబాలకు ఈ సమాచారం అందినట్టు జాతీయ మీడియా(National Media) తెలిపింది. ఇండియా అప్పీల్‌ను ఖతార్ కోర్టు అంగీకరించిందని, అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారంతా భారత నౌకాదళంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. రెండు దశాబ్దాల పాటు దేశానికి సేవలందించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ఓ ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సట్టెన్సీలో వీరు పనిచేసేవారు. అక్కడ పని చేస్తూనే ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్(Submarine) ప్రోగ్రాం కోసం తమదేశంలో గూఢాచార్యానికి(spy) పాల్పడ్డారన్నది ఖతార్ అభియోగం. 2022, ఆగస్టు 30వ తేదీన ఈ ఎనిమిది మంది అధికారులను ఖతార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. నవంబర్ 9వ తేదీన మరణశిక్షపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నామని బాగ్చి తెలిపారు.