✕
నచ్చిన చోటకు వెళ్లి నాలుగు రోజులపాటు కాలక్షేపం చేసి రావడానికి శరదృతువు కంటే మంచి సీజన్ మరొకటి ఉండదు. అది కూడా నవమి నాటి వెన్నెల నుంచి నిండు పున్నమి వరకు ప్రకృతి భలే పసందుగా ఉంటుంది. రంగులద్దుకున్న పుడమి తల్లి అందాలను వర్ణించడానికి కవులు పోటీపడతారు. నేల నాలుగు చెరగులా ఏదో ఒక వేడుక కనువిందు చేస్తుంటుంది. రాజస్థాన్ (Rajasthan)లోని పుష్కర్ ప్రాంతంలో జరిగే ఒంటెల సందడి అలాంటిదే! కళాకారులు గొంతులు సవరించుకున్నారు. వాయిద్యకారులు శ్రుతులు చేసుకున్నారు. హస్తకళా నిపుణులు తమ ఉత్పత్తులను అంగళ్లకు తరలించేశారు.అక్కడ జరుగుతున్న మెగా ఉత్సవానికి రేపే చివరి రోజు. అందుకే అంత హడావుడి.

x
Pushkar Mela
-
- నచ్చిన చోటకు వెళ్లి నాలుగు రోజులపాటు కాలక్షేపం చేసి రావడానికి శరదృతువు కంటే మంచి సీజన్ మరొకటి ఉండదు. అది కూడా నవమి నాటి వెన్నెల నుంచి నిండు పున్నమి వరకు ప్రకృతి భలే పసందుగా ఉంటుంది. రంగులద్దుకున్న పుడమి తల్లి అందాలను వర్ణించడానికి కవులు పోటీపడతారు. నేల నాలుగు చెరగులా ఏదో ఒక వేడుక కనువిందు చేస్తుంటుంది. రాజస్థాన్ (Rajasthan)లోని పుష్కర్ ప్రాంతంలో జరిగే ఒంటెల సందడి అలాంటిదే! కళాకారులు గొంతులు సవరించుకున్నారు. వాయిద్యకారులు శ్రుతులు చేసుకున్నారు. హస్తకళా నిపుణులు తమ ఉత్పత్తులను అంగళ్లకు తరలించేశారు.అక్కడ జరుగుతున్న మెగా ఉత్సవానికి రేపే చివరి రోజు.
-
- అందుకే అంత హడావుడి. రాజస్తాన్లో మహోత్సవం జరుగుతోంది. ఉత్సవం అంటే ఉత్సవం కాదు కానీ మేళ..! అది కూడా ఒంటెల మేళా (Camel fair)!! పశువుల సంత అని కూడా అనొచ్చు.. సంతకెళితే ఏముంటుందనుకుంటున్నారేమో! వినోదించదగ్గ అన్ని అంశాలు అక్కడ ఉంటాయి.. రాజస్తాన్ ఆజ్మీర్లోని పుష్కర్లో జరిగే ఒంటెల పండుగ (Camel festival)కు పర్యాటకులు పోటెత్తిది కూడా ఇందుకే!నవంబర్ 20వ తేదీన మొదలైన ఈ పండుగ నవంబర్ 28వ తేదీ వరకు జరుగుతుంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ ఒంటెల పండుగ ప్రపంచంలోనే అతి పెద్ద ఒంటెల పండుగ. అతిపెద్ద పశువుల పండుగ.. కార్తీకమాసం (Kartik Purnima)లో జరిగే ఈ వేడుకలో మూడు లక్షల మందికి పైగా పాల్గొంటారు.
-
- ఈసారి ఇంచుమించు అయిదు లక్షల మందికి పైగానే వచ్చారు. ఈ ఉత్సవంలో అరలక్షకు పైగా లొట్టిపిట్టలు కనువిందు చేస్తుంటే ఉత్సాహం కట్టలు తెంచుకోకుండా ఎలా ఉంటుంది..? ఇక కార్తీక పౌర్ణమి రోజైతే అటు పర్యాటకులు. ఇటు భక్తులతో పుష్కర్ కిక్కిరిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజున పుష్కర్లో స్నానంచేస్తే పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం.. పుష్కర్ (Pushkar)లో ఎడారి ఓడల విన్యాసాలను. అవి చేసే సందడిని చూసేందుకు దేశవిదేశాల నుంచి బోలెడంత మంది పర్యాటకులు వస్తుంటారు. స్థానికుల జానపద గేయాలను విని పరవశులవుతారు. వారి నృత్యాలను వీక్షించి తన్మయులవుతారు. ఒక్క ఒంటెలే కాదు. గుర్రాలు, ఆవులు, ఎద్దులు కొన్ని ఏనుగులు కూడా తమ విన్యాసాలను ప్రదర్శించడానికి ఉత్సాహం చూపుతాయి.
-
- వీటి కొనుగోలు- అమ్మకాలు కూడా ఆ సంతలోనే జరుగుతాయి. మేళాలో పాల్గొనేందుకు గుంపులు గుంపులుగా తరలివస్తున్న ఒంటెలను చూడటం ఓ మధురానుభూతి. ఎక్కడ చూసినా బారులుతీరి నిలబడ్డ ఒంటెలే కనిపిస్తాయి. కనువిందు చేస్తాయి. అన్నట్టు సందర్శకుల కోసం అక్కడ తాత్కాలికంగా ఓ నగరమే రూపుదిద్దుకుంటుంది. గుడారాలతో నిర్మించిన ఆ నగరం కూడా కళాత్మకంగా ఉంటుంది. పర్యాటకులే కాదు. ఒంటెల యజమానులు, వారి కుటుంబసభ్యులు సైతం ఈ గుడారాల్లోనే బసచేస్తారు. పుష్కర్లో ఓ సరస్సు (Pushkar Lake)ఉంది. ఆ సరస్సు ఏర్పడటం వెనుక ఓ పురాణగాథ ఉంది.. సృష్టికర్త బ్రహ్మ పుష్కర్ దగ్గర ఓ కమలాన్ని జారవిడిచాడట! అప్పుడు దాని చుట్టూ పెద్ద సరస్సు ఏర్పడిందట! అదే పుష్కర్ తటాకం.
-
- ఆ సరస్సు కేంద్రంగా ఓ నగరమే వెలిసింది. అన్నట్టు బ్రహ్మదేవుడికి గుడి (Brahma temple) ఉండదంటారు కానీ ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉంది. బ్రహ్మదేవుడే (lord Brahma) స్వయంగా ఈ స్థలాన్ని నిర్ణయించాడట. యుగాంత సమయాన విశ్వామిత్రుడు ఈ గుడిని కట్టించాడని అంటారు. ప్రపంచంలో ఉన్న పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని చెబుతుంటారు. పురాణ ప్రసిద్ధి పొందిన పంచ సరోవరాల్లో పుష్కర్ ప్రస్తావన కూడా ఉంది.మళ్లీ పుష్కర్ మేళా విషయానికి వస్తే ఒంటెల పండుగ జరిగినన్ని రోజులు ఆ ప్రాంతం పెద్ద జాతరను తలపిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంతం సింగారించుకుంటుంది. పుష్కర్ సరస్సుకు వెళ్లే రహదారులన్నీ జనాలతో నిండిపోతాయి. రోడ్లకు ఇరువైపులా షాపులు (Shops)వెలుస్తాయి.
-
- కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల హస్తకళలు (Handi crafts)అంగట్లో అమ్మకానికి ఉంటాయి. ఒంటెల అలంకార వస్తువులు చాలా ఫేమస్! వాటి కోసమే వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. వెండి గంటలు, ఇత్తడి అందెలు, గొలుసులు, కడియాలు, అల్లిక వస్త్రాలు ఇలా రకరాల వస్తువులను అక్కడ దొరుకుతాయి. ఒంటెల పరుగుపందాలే కాదు, ఇక్కడ వాటికి అందాల పోటీలను కూడా నిర్వహిస్తారు.లొట్టిపిట్టలకే కాదు. మనకూ ఉంటాయి పోటీలు.. రాజస్తాన్లో సంప్రదాయబద్దంగా తలపాగాను ధరిస్తారు కదా! వాటిల్లో కూడా పోటీలు జరుగుతాయి.అంటే ఎవరు తక్కువ సమయంలో తలపాగాను అందంగా చుట్టుకోగలరో వారిని విజేతగా ప్రకటిస్తారు. అలాగే మీసాలకు పోటీలు జరుగుతాయి. మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టగలిగినవాడే మొనగాడు.ఇక అమ్మాయిలకు మెహందీ పోటీలు, నెత్తిన కడవ పెట్టుకుని పరుగెత్తడం, గుర్రపు స్వారీలు, కబడ్డీలు, టగ్ ఆఫ్ వార్లు, పారాచ్యూట్ పోటీలు ఇలా ఎన్నో ఎన్నెన్నో జరుగుతాయక్కడ.

Ehatv
Next Story