ఒడిశా(Odisha)లోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథ ఆలయం(Jagannath Temple)లోకి ప్రవేశించే భక్తులకు హెచ్చరికతో కూడిన సూచన. ఇకపై ఆలయంలోకి తమ ఇష్టమున్న డ్రస్సును వేసుకుని వెళతామంటే కుదరదు. తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకుంటే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.
ఒడిశా(Odisha)లోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథ ఆలయం(Jagannath Temple)లోకి ప్రవేశించే భక్తులకు హెచ్చరికతో కూడిన సూచన. ఇకపై ఆలయంలోకి తమ ఇష్టమున్న డ్రస్సును వేసుకుని వెళతామంటే కుదరదు. తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకుంటే ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఈ కొత్త నిబంధనలు నూతన సంవత్సరం నుంచి అమలులోకి వచ్చాయి. జనవరి 1వ తేదీన ఆలయ పరిసరాలలో చాలా మంది పురుషులు ధోతీలతో, మహిళలు చీరలు, సల్వార్ కమీజ్‌లతో కనిపించారు. ఆలయ విశిష్టతను కాపాడటానికే ఈ నిబంధనలు తీసుకు వచ్చామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆలయ పరిసరాల్లో గుట్కా, పాన్ మసాలాలు, ప్లాస్టిక్ సంచులను కూడా నిషేధించామన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.