వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande-Bharath Express) రైళ్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెబుతుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే వందేభారత్‌ రైళ్లను అనేక చోట్ల ప్రారంభించారు. సెమీ హైస్పీడ్‌ రైలు నాణ్యతపైనే బోల్డన్నీ అనుమానాలు స్తున్నాయి. విమర్శలు వస్తున్నాయి.

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande-Bharath Express) రైళ్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెబుతుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే వందేభారత్‌ రైళ్లను అనేక చోట్ల ప్రారంభించారు. సెమీ హైస్పీడ్‌ రైలు నాణ్యతపైనే బోల్డన్నీ అనుమానాలు స్తున్నాయి. విమర్శలు వస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలే అందుకు కారణం. లేటెస్ట్‌గా వడగండ్ల వానకు(Hail strom) ఓ వందేభారత్‌ రైలు దెబ్బతిన్నది. పూరి-హౌరా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన మూడు రోజులకే వడగళ్ల వర్షం వల్ల దెబ్బ తిని నిలిచిపోయింది.

భద్రాక్‌ రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పిడుగుపడి డ్రైవర్‌ క్యాబిన్‌ విండ్‌ స్క్రీన్‌, సైడ్‌ విండోలు పగిలిపోయాయి. దులాఖ పట్నా మంజురి రోడ్‌ స్టేషన్‌ మధ్య ట్రైన్‌ నిలిచిపోయింది. రైలులో పవర్‌సప్లయ్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్టు చేశారు. తమ అసంతృప్తిని చెప్పుకున్నారు. రైల్వే అధికారులు మాత్రం భారీవర్షం కారణంగా రైలు ఓవర్‌హెడ్ వైర్‌పై చెట్టు పడిపోయిందని, దీని కారణంగా పాంటోగ్రాఫ్ విరిగిందని అంటున్నారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. సోమవారం రైలును రద్దు చేశారు.

Updated On 22 May 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story