మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) నిర్లక్ష్యంగా కారు(Car) నడిపి ఇద్దరి మృతికి(Death) కారణమైన మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ను(Vishal Agarwal) పోలీసులు అరెస్ట్‌ చేశారు. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద నమోదైన కేసు ఆధారంగా ప్రముఖ బిల్డర్‌ అయిన విశాల్‌ అగర్వాల్‌ను ఔరంగాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొన్న ఆదివారం తెల్లవాజామున కొరెగావ్‌ పార్క్‌లో పదిహేడేళ్ల బాలుడు పీకల్దాక మద్యం తాగేసి(Drunk) ఆ మత్తులో పోర్షే కారుతో ఓ బైకును ఢీకొట్టాడు.

మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) నిర్లక్ష్యంగా కారు(Car) నడిపి ఇద్దరి మృతికి(Death) కారణమైన మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ను(Vishal Agarwal) పోలీసులు అరెస్ట్‌ చేశారు. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద నమోదైన కేసు ఆధారంగా ప్రముఖ బిల్డర్‌ అయిన విశాల్‌ అగర్వాల్‌ను ఔరంగాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొన్న ఆదివారం తెల్లవాజామున కొరెగావ్‌ పార్క్‌లో పదిహేడేళ్ల బాలుడు పీకల్దాక మద్యం తాగేసి(Drunk) ఆ మత్తులో పోర్షే కారుతో ఓ బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ సంఘటన తర్వాత విశాల్‌ అగర్వాల్‌ పరారీ అయ్యాడు. పోలీసులు అతడిని వెతికిపట్టుకుని మంగళవారం అరెస్ట్‌ చేశారు. ప్రమాదం సమయంలో మైనర్‌ బాలుడు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ బైక్‌ను ఢీకొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా తెలిసింది. 12వ తరగతి పరీక్షాఫలితాలు వచ్చిన తర్వాత నిందిత బాలుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి స్థానిక పబ్‌లో పార్టీ చేసుకున్నాడు. ఫుల్లుగా మద్యం తాగాడు. మహారాష్ట్రలో పాతికేళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. అయితే ఈ బాలుడికి మద్యం ఎలా అమ్మినట్టు? చట్టవ్యతిరేకంగా మైనర్‌కు మద్యం అమ్మిన బార్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరి మరణానికి కారణమైన బాలుడికి జువైనల్ కోర్టు 14 గంటల్లోనే బెయిల్ ఇవ్వడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పూణె పోలీసులు సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేశారు. నేరం తీవ్రత దృష్ట్యా అతడిని మేజర్‌గా పరిగణించాలని కోర్టును కోరారు. తాము నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేశామని పూణె పోలీసు కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌ చెప్పారు.

Updated On 21 May 2024 12:29 AM GMT
Ehatv

Ehatv

Next Story