లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై(Brij bhushan Saran Singh) చర్యలు తీసుకోవాలంటూ టాప్ రెజ్లర్లు(Wrestlers) చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీలోని(Delhi) జంతర్‌మంతర్(Jantarmantar) దగ్గర గత కొన్ని రోజులుగా రెజర్లు ధర్నా చేపడుతూ వస్తున్నారు. ఇవాళ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష(P.T Usha) వారిని పరామర్శించారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై(Brij bhushan Sharan Singh) చర్యలు తీసుకోవాలంటూ టాప్ రెజ్లర్లు(Wrestlers) చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీలోని(Delhi) జంతర్‌మంతర్(Jantarmantar) దగ్గర గత కొన్ని రోజులుగా రెజర్లు ధర్నా చేపడుతూ వస్తున్నారు. ఇవాళ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష(P.T Usha) వారిని పరామర్శించారు. వారితో మాట్లాడారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రెజ్లర్లకు అండగా నిలబడి న్యాయం చేస్తానని పి.టి.ఉష చెప్పడంతో మనోధైర్యం పెరిగిందని రెజ్లర్ బజరంగ్ పూనియా(Bajrang Punia) అన్నారు. తమ సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌కు జైలు శిక్ష పడేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని బజరంగ్ పునియా పేర్కొన్నారు.
చిత్రమేమిటంటే మొన్ననే రెజ్లర్ల ఆందోళనను పి.టి.ఉష తప్పుపట్టారు. భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ మండిపడ్డారు. క్రీడాకారులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం తగని పని అన్నారు. కమిటీ రిపోర్ట్ వచ్చే వరకైనా వారు వేచి ఉండాల్సిందని, వారు చేసిన పని క్రీడకు, దేశానికి మంచిది కాదని ఉష విమర్శించారు. పి.టి.ఉష వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడాకారిణి అయి ఉండి సాటి క్రీడాకారిణుల పట్ల అలా మాట్లాడటమేమిటని రాజకీయ నాయకులు కూడా ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్ల గురించి తక్కువగా మాట్లాడడం అవమానకరం అంటూ పి.టి.ఉషను తిట్టిపోశారు. ఉష వ్యాఖ్యలపై రెజ్లర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసి ఎందుకైనా మంచిదని భావించిన ఉష రెజ్లన్లను పరామర్శించారు.