రానున్న రోజులలో భారత్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్‌తో(Prostate cancer) ముప్పు వాటిల్లబోతున్నది. ప్రొస్టేట్ క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగబోతున్నది. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరగే ప్రమాదం ఉంది. ఇండియాతో(India) పాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రొస్టేట్ క్యాన్సర్ అధ్యయనం చెబుతోంది.
రానున్న రోజులలో భారత్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్‌తో(Prostate cancer) ముప్పు వాటిల్లబోతున్నది. ప్రొస్టేట్ క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగబోతున్నది. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరగే ప్రమాదం ఉంది. ఇండియాతో(India) పాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రొస్టేట్ క్యాన్సర్ అధ్యయనం చెబుతోంది. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు రెట్టింపు అవుతాయి. మరణాల సంఖ్య కూడా 85 శాతం పెరుగుతాయి. ప్రస్తుతం ఇండియాలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులోల ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు మూడు శాతం వరకు ఉంటున్నాయి. మన దేశంలో ఏడాదికి 33 వేల నుంచి 42 వేల ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. 2040 నాటికి ఏడాదికి 71 వేల మంది ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. ఈ క్యాన్సర్ బారిన పడిన వారిని గుర్తించడం ఆలస్యం అవుతుండటంతో మరణాలు ఎక్కువవుతున్నాయి. చాలా మందిలో వ్యాధి ముదిరిన తర్వాతే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించగలుగుతున్నారు. మనదేశంలో వ్యాధి ఫైనల్ స్టేజిలో ఉన్నప్పుడు గుర్తించడం వల్ల 65 శాతం బాధితులు మరణిస్తున్నారని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ వేదాంగ్ మూర్తి అంటున్నారు. దేశంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఏడాదికి 18 వేల నుంచి 20 వేల మంది చనిపోతున్నారు. అరవై ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరిపించుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.