తమిళ హీరో ధనుష్‌పై తమిళ్‌ ఇండస్ట్రీ రెడ్‌కార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

తమిళ హీరో ధనుష్‌పై తమిళ్‌ ఇండస్ట్రీ రెడ్‌కార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) జూలైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్‌ 1 నుంచి ధనుష్‌(Dhanush)తో సినిమాలు చేయబోమంటూ ఓ నిర్ణయం తీసుకుంది. టీఎఫ్‌పీసీ తీసుకున్న నిర్ణయం తమిళ(Tamil) ఇండస్ట్రీని షేక్‌ చేసింది. రెమ్యునరేషన్‌ తీసుకుని షూటింగ్‌కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్‌కార్డులు జారీ చేస్తుంది. ధనుష్‌పై కూడా ఈ ఏడాది జులైలో రెడ్‌కార్డ్‌ జారీ అయింది. త్రేండల్‌ ఫిల్మ్స్‌(Thenandal Films), ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్‌(Five Star Creations Banner)నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్‌ అడ్వాన్స్‌ తీసుకున్నప్పటికీ షూటింగ్‌కు డేట్స్‌ మాత్రం ఇవ్వడం లేదట. పాపం వారు మాత్రం ఎన్ని సంవత్సరాలని ఎదురుచూస్తారు? ఆ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించాయి. ఫలితంగా ధనుష్‌పై రెడ్‌ కార్డ్‌ జారీ చేస్తున్నట్లు TFPC ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్‌తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఫైవ్ స్టార్ క్రియేషన్స్‌కి తిరిగి చెల్లిస్తాడని ఆపై త్రేండల్‌ ఫిల్మ్స్‌తో సినిమా చేయడానికి ధనుష్‌ అంగీకరించాడని తెలిసింది. ఇదే విషయాన్ని రెండు ప్రొడక్షన్ హౌస్‌లు TFPC తెలిపాయట! అయితే, కొన్ని షరతులపై ధనుష్‌ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేశారని ఇండస్ట్రీ వారు అంటున్నారు.

ehatv

ehatv

Next Story