లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు(Lok Sabha Elections) స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో ప‌లువురు నేత‌లు బ‌రిలో దిన‌నున్న స్థానాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్(Congress) నాయ‌కురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పోటీపై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రియాంక వారణాసి(Varanasi) నుంచి పోటీ చేస్తారా లేక ప్రయాగ్‌రాజ్‌(Prayagraj), ఫుల్‌పూర్‌(Phulpur) నుంచి బ‌రిలోకి దిగుతారా లేక మరేదైనా సీటు నుంచి కంటెస్ట్ చేస్తారా అనే విష‌య‌మై ఉత్కంఠ మొదలైంది.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు(Lok Sabha Elections) స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో ప‌లువురు నేత‌లు బ‌రిలో దిన‌నున్న స్థానాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్(Congress) నాయ‌కురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పోటీపై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రియాంక వారణాసి(Varanasi) నుంచి పోటీ చేస్తారా లేక ప్రయాగ్‌రాజ్‌(Prayagraj), ఫుల్‌పూర్‌(Phulpur) నుంచి బ‌రిలోకి దిగుతారా లేక మరేదైనా సీటు నుంచి కంటెస్ట్ చేస్తారా అనే విష‌య‌మై ఉత్కంఠ మొదలైంది. ఈ మేర‌కు యూపీలోని(Uttarpradesh) ఐదు స్థానాలలో పార్టీ హోంవర్క్‌లో నిమగ్నమై ఉంది. రాష్ట్ర నాయకత్వం మొదటి ప్రాధాన్యత వారణాసికే.. తద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా సవాల్ విసిరాల‌ని భావిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ(Sonia Gandhi) ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని కాంగ్రెస్‌లో ఊహాగానాలు ఉండేవి. అయితే.. సోనియా గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. బూత్‌ల వారీగా స్థానిక కార్యకర్తలు సన్నాహాలు ప్రారంభించారు. సోనియాగాంధీ పేరుతో ప్రచారం కూడా ప్రారంభించారు.

కోర్టు ఆదేశాల కారణంగా రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక అమేథీ(Amethi) నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయ‌డంపై స్పష్టత వచ్చింది. దీంతో రాహుల్‌ అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సంప్రదాయ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టవద్దని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా సూచించారు. గాంధీ కుటుంబ సభ్యులకు సమాజ్ వాదీ పార్టీ మనస్పూర్తిగా మద్దతు ఇస్తుందని విశ్వసిస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీపై అంద‌రి దృష్టి పడింది. రాష్ట్రంలోని ఐదు సీట్లపై ప్రియాంక గాంధీకి రాష్ట్ర నాయకత్వం హోంవర్క్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వారణాసి ప్రథమ, ఫుల్‌పూర్‌ ద్వితీయ, ప్రయాగ్‌రాజ్‌ తృతీయ స్థానంలో నిలిచాయి. ఈ సీట్లతో కాంగ్రెస్‌కు లోతైన‌ అనుబంధం ఉంది. మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా ఫుల్పూర్ నుండి మూడుసార్లు ఎంపీగా ఉన్నారు. 16 ఎన్నికల్లో బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ఏడుసార్లు, ఎస్పీ ఆరుసార్లు, బీఎస్పీ ఒకసారి, జనతాదళ్ రెండుసార్లు గెలిచాయి. ప్రయాగ్‌రాజ్‌లో ఏడుసార్లు కాంగ్రెస్ గెల‌వ‌గా.. బీజేపీ నాలుగుసార్లు విజ‌యం సాధించింది.

వారణాసి కూడా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపైనే యావత్ దేశం దృష్టి సారిస్తుంది. ఈ మూడు సీట్లు మినహా మరో రెండు సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విధంగా ఐదు సీట్ల పూర్తి డేటాను తయారు చేసి కేంద్ర కార్యాలయానికి పంపుతారు. ఈ ఐదు సీట్ల‌లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర నాయ‌క‌త్వం భావిస్తుంది. ఇందుకోసం పార్టీ అంతర్గతంగా సంబంధిత సీట్ల సర్వే కూడా చేయనుంది. తద్వారా ప్రియాంక పోటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ అన్నారు. ఆమె అక్కడి నుంచి పోటీ చేయకుంటే.. ఆమె కోరుకున్న ఇతర స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారు. పూర్తి వ్యూహంతో ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు.. వారిని గెలిపించేలా ప‌నిచేస్తామ‌ని అన్నారు.

Updated On 29 Aug 2023 3:51 AM GMT
Ehatv

Ehatv

Next Story