మితిమీరిన అభిమానంతో వచ్చిన మతిమరుపు ఏమో కానీ మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) కాంగ్రెస్(congress) నేత ప్రియాంక గాంధీకి(Priyanka Gandhi) ఓ చిత్రమైన సంఘటన ఎదురయ్యింది. ఓ అభిమాని బోకే(Boquet) అయితే ఆమెకు ఇచ్చాడు కానీ అందులో పూలు(Flowers) పెట్టడం మర్చిపోయాడు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార(Election Campaing) సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

Priyanka Gandhi
మితిమీరిన అభిమానంతో వచ్చిన మతిమరుపు ఏమో కానీ మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) కాంగ్రెస్(congress) నేత ప్రియాంక గాంధీకి(Priyanka Gandhi) ఓ చిత్రమైన సంఘటన ఎదురయ్యింది. ఓ అభిమాని బోకే(Boquet) అయితే ఆమెకు ఇచ్చాడు కానీ అందులో పూలు(Flowers) పెట్టడం మర్చిపోయాడు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార(Election Campaing) సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఆమె వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. అయితే ఓ నేత ఇచ్చిన పూలగుత్తిలో పూలు మాయమయ్యాయి. ఇది చూసిన ప్రియాంక పూలగుత్తిలో పూలు లేవని అక్కడున్న నేతలకు నవ్వుతూ చెప్పారు. వారు కూడా కాసేపు నవ్వుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై బీజేపీ(BJP) అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్(Rakesh Pathak) స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో 'ఇదో గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుంచి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది' అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే బహిరంగసభలో ప్రియాంకగాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 250 కుంభకోణాలు చేసి, ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు.
