కాంగ్రెస్(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా సోమవారం మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని షహీద్ స్మారక్(Shahid Smarak Grounds) మైదాన్ నుండి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆమె నర్మదా తీరంలో ప్రార్థనలు చేశారు.
కాంగ్రెస్(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా సోమవారం మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని షహీద్ స్మారక్(Shahid Smarak Grounds) మైదాన్ నుండి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆమె నర్మదా తీరంలో ప్రార్థనలు చేశారు. సోమవారం దుమ్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే సన్నాహకాలు ప్రారంభించింది కాంగ్రెస్.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత పెన్షన్ అమలు చేస్తామని, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్(LPG Cylinder) ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. మహన్ నారీ సమ్మాన్ నిధి కింద రూ.1500 చొప్పున మహిళలకు అందజేస్తామని తెలిపారు. దీంతో పాటు కమల్‌నాథ్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైతుల రుణమాఫీని పూర్తి చేస్తానని, ఇది నా హామీ అని ప్రియాంక గాంధీ మాటిచ్చారు. కర్ణాటక, హిమాచల్‌లో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు.
ఇక్కడ అవినీతి, లంచగొండితనం పెరిగిపోయిందని.. 225కు పైగా కుంభకోణాలు జరిగాయని ప్రియాంక గాంధీ వాద్రా శివరాజ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కుంభకోణాలు జరగని ప్రాంతమే లేదని ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం పంపిణీ కూడా మోసంగా మారిందన్నారు. అధికారం కోసం బీజేపీ నేతలు ఏమైనా చేస్తారని బీజేపీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మనకు కూడా అలాంటి నాయకులు ఉన్నారని, అధికారం కోసం మమ్మల్ని వదిలిపెట్టి తమ సిద్ధాంతాలను మార్చుకున్నారని జోతిరాధిత్య సింథియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌లో పాత పెన్షన్ అమలు చేస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 100 యూనిట్ల విద్యుత్‌ను మాఫీ చేస్తామని, 200 యూనిట్ల విద్యుత్ బిల్లు సగానికి తగ్గుతుందని చెప్పారు. బీజేపీ గుండెల్లో మీపై విశ్వాసం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ఇక్కడకు వచ్చి ప్రకటనలు చేస్తారు, కానీ వాటిని నెరవేర్చరని అన్నారు.
ఇదిలావుంటే.. జబల్‌పూర్ మహాకౌశల్ ప్రాంతానికి మధ్యలో ఉంది. ఇక్కడ గిరిజన ఓటర్లు ఎక్కువ. 2018 అసెంబ్లీ ఎన్నికలలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన 13 సీట్లలో 11 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, మిగిలిన రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో ప్రియాంక ఇక్కడినుండి ప్రచారం ప్రారంభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.