ప్రియాంక గాంధీ వాద్రా విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించని నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలవగా.. ప్రియాంక గాంధీని రాయ్‌బరేలీలో నిలబెడతారా.. లేక కేరళ లోని వయనాడ్ నుండి నిలబెడతారా అనే సస్పెన్స్ కొనసాగింది. అయితే రాహుల్ గాంధీ వాయనాడ్ ను వదులుకోడానికి సిద్ధమయ్యారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం కేరళ రాజకీయ దృశ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ తమ కుటుంబానికి వాయనాడ్ నియోజకవర్గం అంటే ఎంతో ముఖ్యమని ప్రియాంక తెలిపారు. రాయ్‌బరేలీ, అమేథీ తర్వాత గాంధీ కుటుంబానికి వయనాడ్‌ మూడో నియోజకవర్గంగా మారింది. వయనాడ్ ప్రజలతో రాహుల్ గాంధీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2019లో రికార్డు స్థాయిలో నాలుగు లక్షల ఓట్లతో, గత ఎన్నికల్లో 3.6 లక్షల ఓట్ల తేడాతో రాహుల్ గెలిచారు. గత వారం జరిగిన థాంక్స్ గివింగ్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడుతూ, "వయనాడ్ తో నా సంబంధం జీవితాంతం మారదని నేను మాట ఇస్తున్నాను" అని అన్నారు.


Eha Tv

Eha Tv

Next Story