Priyanka Gandhi : బీఆర్ఎస్‌ను గద్దె దింపి కొలువులు ఇచ్చే కాంగ్రెస్ను గెలిపించండి
ఖమ్మం(Khammam), పాలేరు(Paleru Constituency) నియోజకవర్గాల్లో ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రోడ్ షో(Road Show) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్(CM KCR) తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గద్దె దింపండి..
ఖమ్మం(Khammam), పాలేరు(Paleru Constituency) నియోజకవర్గాల్లో ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రోడ్ షో(Road Show) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్(CM KCR) తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గద్దె దింపండి.. కొలువులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించండని సూచించారు.
తెలంగాణ ఇచ్చింది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం బాగు కోసం కాదన్నరు. రైతులు, ఆడబిడ్డలు, యువత, విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం మీ కలలను నిజం చేయలేదన్నారు. పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించిందన్నారు.
కాంగ్రెస్(congress) పాలిత రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేశాయి. ప్రజల సంపదను ప్రజలకు పంచాయని తెలిపారు. యువతకు కొలువులు, అందరికీ ఇండ్లు, మహిళలకు ఆర్థిక స్వాలంబన అందించే పథకాలు, రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎన్నుకోవాలని కోరారు. తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే.. ప్రజల సంపద ప్రజలకు అందుతుందన్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.