ఎన్టీఆర్(NTR) నటించిన రౌడి రాముడు(Raudi Ramudu) -కొంటె కృష్ణుడు సినిమాలో జైలులో రామాయణం నాటకం వేస్తూ కారాగారం నుంచి ఖైదీలు చక్కగా తప్పించుకుంటారు.
ఎన్టీఆర్(NTR) నటించిన రౌడి రాముడు(Raudi Ramudu) -కొంటె కృష్ణుడు సినిమాలో జైలులో రామాయణం నాటకం వేస్తూ కారాగారం నుంచి ఖైదీలు చక్కగా తప్పించుకుంటారు. అచ్చంగా ఇలాగే ఉత్తరాఖండ్‌లోనూ(Uttarakhand) జరిగింది. రామ్‌లీలా(Ram leela) నాటకంలో భాగంగా వానరులుగా నటించిన ఇద్దరు ఖైదీలు నిచ్చెన సాయంతో గోడ దూకి జైలు నుంచి పరారయ్యారు. హరిద్వార్‌లో(Haridwar) జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దసరా(Dussehra) పండుగ సందర్భంగా హరిద్వార్ జైలులో కొందరు ఖైదీలు శనివారం రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో కొందరు ఖైదీలు వానరులుగా నటించారు. నాటకం రసవత్తరంగా సాగుతుండడం అందరూ అందులో లీనమయ్యారు. అధికారులు, సిబ్బంది, గార్డులు ఇలా ప్రతి ఒక్కరు నాటకం చూస్తూ తన్మయత్వం చెందసాగారు. ఇదే అదునుగా భావించిన వానరవేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. నిచ్చెన వేసుకుని జైలు గోడను ఎక్కి అక్కడ్నుంచి దూకేసి పారిపోయారు. ఇలా జరుగుతుందని అధికారులు ఊహించి ఉండరు. ప్రభుత్వం దీనిపై సీరియస్ అయ్యింది. ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.