అతడు పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు(Teacher). అయితే తను చేస్తున్న వృత్తిని మరిచాడు. విద్యార్థినులపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి వారిని లోబరుకునే ప్రయత్నం చేశాడు. లైంగిక వేధింపులకు(Abuse) కూడా పాల్పడ్డాడు. ఈ కామపిశాచి ఒకర్నో ఇద్దరినో కాదు, తన స్కూల్‌లో చదువుతున్న 142 మంది విద్యార్థులను లైంగికంగా వేధించాడు ఈ దుష్టుడు. హర్యానాలోని(Haryana) జింద్ జిల్లాలో(Jind District) ఉన్న ప్రభుత్వ స్కూల్(Government school) హెడ్‌మాస్టర్ వికృత చేష్టలను భరించలేక 15 మంది విద్యార్థునులు నోరు విప్పారు.
అతడు పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు(Teacher). అయితే తను చేస్తున్న వృత్తిని మరిచాడు. విద్యార్థినులపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి వారిని లోబరుకునే ప్రయత్నం చేశాడు. లైంగిక వేధింపులకు(Abuse) కూడా పాల్పడ్డాడు. ఈ కామపిశాచి ఒకర్నో ఇద్దరినో కాదు, తన స్కూల్‌లో చదువుతున్న 142 మంది విద్యార్థులను లైంగికంగా వేధించాడు ఈ దుష్టుడు. హర్యానాలోని(Haryana) జింద్ జిల్లాలో(Jind District) ఉన్న ప్రభుత్వ స్కూల్(Government school) హెడ్‌మాస్టర్ వికృత చేష్టలను భరించలేక 15 మంది విద్యార్థునులు నోరు విప్పారు. తమను హెడ్‌మాస్టర్(Headmaster) లైంగికంగా వేధిస్తున్నాడంటూ రాష్ట్రపతి ముర్ముకు(Draupadi Murmu), ప్రధానమంత్రి మోదీకి(PM Modi), జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు లేఖలు రాశారు. అప్పుడు 15 మంది అనుకున్న సంఖ్య ఇప్పుడు 142కు చేరింది. లెటర్ విషయం బయటకు వచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఏ కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన ఈ కమిటీ 55 ఏళ్ల ఆ హెడ్‌మాస్టర్ చేసిన పాపపు పనులను వెలుగులోకి తీసుకు వచ్చింది. లేఖ రాసిన 15 మంది విద్యార్థినులను విచారిస్తున్న సమయంలో ఆ సంఖ్య 60కి చేరుకుంది. దీంతో విద్యార్థులలో ధైర్యం వచ్చింది. వారు కూడా కమిటీ ముందు హెడ్‌మాస్టర్ వేధింపులను చెప్పుకుని ఆవేదన చెందారు. ఆ తర్వాత మరికొంతమంది ముందుకొచ్చారు. అలా ఈ సంఖ్య 142కు చేరుకుంది. ఇంత మంది బయటకు వచ్చి తమ బాధను చెప్పుకోవడంతో కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు ఆ హెడ్‌మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఆ కీచక హెడ్‌మాస్టర్‌పై చార్జ్‌షీట్ ఓపెన్ చేయబోతున్నారు.