ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) జూలై 7-8 తేదీల్లో పలు అభివృద్ధి పనుల(Development Works) శంకుస్థాపన(Foundation), ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు.

Infrastructure development projects Works
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) జూలై 7-8 తేదీల్లో పలు అభివృద్ధి పనుల(Development Works) శంకుస్థాపన(Foundation), ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు.
జులై 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు, ప్రధానమంత్రి తెలంగాణలోని(Telangana) వరంగల్‌కు(Warangal) చేరుకుని, దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోనూ రూ.6,100 కోట్ల విలువైన ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన(Infrastructure development projects) చేస్తారు. ఇందులో భాగంగా రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు పునాది వేస్తారు. ఇందులో నాగ్‌పూర్-విజయవాడ కారిడార్(Nagpur-Vijayawada Corridor) కింద 108 కిలోమీటర్ల మంచిర్యాల-వరంగల్ సెక్షన్ కూడా ఒకటిగా ఉంది. దీనిద్వారా మంచిర్యాల-వరంగల్ మధ్య దూరం దాదాపు 34 కిలోమీటర్లు తగ్గడమేగాక ప్రయాణ సమయం ఆదా కావడంసహా జాతీయ రహదారి 44, 65లలో వాహన రద్దీని తగ్గిస్తుంది. అలాగే జాతీయ రహదారి పరిధిలో 68 కిలోమీటర్ల కరీంనగర్-వరంగల్ సెక్షన్‌ను రెండు నుంచి నాలుగు వరుసలుగా ఉన్నతీకరించే పనులకూ ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్’టైల్ పార్క్, వరంగల్‌లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల అనుసంధానం మెరుగులో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
కాజీపేటలో రూ.500 కోట్లతో గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ అత్యాధునిక కర్మాగారం వ్యాగన్ తయారీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇది ఆధునిక సాంకేతిక ప్రమాణాలతోపాటు వ్యాగన్లకు రంగువేసే రోబోటిక్ యంత్రాలు, అత్యధునాతన యంత్రసామగ్రితోపాటు ఆధునిక సామగ్రి నిల్వ-నిర్వహణ వగైరా సౌకర్యాలతో ఏర్పాటు చేయబడుతుంది. దీనిద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు సమీప ప్రాంతాల్లో అనుబంధ యూనిట్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.
