కొన్ని వారాల కిందట భారత బౌలర్ మహ్మద్ షమీని(Mohammed Shami) ఆకాశానికెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi). షమీ భాయ్ అని ఆత్మీయంగా సంబోధించారు. తమ ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమేనని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వాన్ని ముస్లింలు(Muslim) అభిమానించేలా ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు.
కొన్ని వారాల కిందట భారత బౌలర్ మహ్మద్ షమీని(Mohammed Shami) ఆకాశానికెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi). షమీ భాయ్ అని ఆత్మీయంగా సంబోధించారు. తమ ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమేనని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వాన్ని ముస్లింలు(Muslim) అభిమానించేలా ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. మొదటి దశ ఎన్నికల్లో ఏదో తేడా కొడుతుందనే సంకేతాలు రావడంతోనే మోదీ ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో ఏం చేశామో చెప్పకుండా ఎప్పటిలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ(BJP). హిందుమతం(Hindu relegion) ప్రమాదంలో ఉన్నదని హిందువులను భయపెడుతూ వారి ఓట్లు తమకు గంపగుత్తగా పడేట్టు చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే దేశంలో ఉండే సంపదనంతా ముస్లింలకు కట్టబెడతారని మోదీ వ్యాఖ్యానిస్తూ గతంలో మన్మోహన్‌సింగ్ చెప్పిన మాటలను ఉదాహరించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పడం అసహ్యంగా అనిపిస్తోంది. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న ప్రధానికి ఇప్పటికీ హుందాగా మాట్లాడటం చేతకాదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. 2006 మన్మోహన్ సింగ్ ఆర్ధిక ప్రధాన్యతలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అప్పుడాయన దేశంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు అందరినీ ప్రస్తావిస్తూ ఈ మాట అన్నారు. అయితే మైనారిటీలకే తొలి హక్కు అనే మాటను మాత్రం కత్తిరించిన బీజేపీ
దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ముస్లింలకు సంపద ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇచ్చేది. మన్మోహన్ సింగ్ ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు.