ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్‌గా 20 వరకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నట్లు చీఫ్ సెక్రటరీ వెల్లడించారు. ‘సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌ సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్‌ వెళతారు. అని సీఎస్‌ వివరించారు. అయితే ప్రధాని విశాఖలో రోడ్డు షోలో పాల్గొంటారని సీఎస్‌ అన్నారు. వంటిల్లు రెస్టారెంట్ నుంచి ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీలో పాల్గొంటారు. విశాఖ రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు, కృష్ణపట్నం ఇండ్రస్టియల్‌ నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్‌ రైల్వే లైన్ల డబ్లింగ్‌ వంటి పనులకు శంకుస్థాపన చేస్తారు. చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేస్తారు.

ehatv

ehatv

Next Story