Ayodhya : బాల రాముడికి ప్రధాని మోదీనే నామకరణం చేస్తారట!
అయోధ్య రామమందిరంలో(Ayodhya ram mandir) ఈ నెల 22వ తేదీన జరగనున్న ప్రాణప్రతిష్ట కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రధాన అతిథిగా విచ్చేయనున్నారు. ఆ రోజు గర్భగుడిలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయనున్నారు. బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) ఆ విగ్రహానికి పేరు పెట్టనున్నారు. ఆయన ఏ పేరు పెడతారనేది 22వ తేదీన తెలియనుంది.
అయోధ్య రామమందిరంలో(Ayodhya ram mandir) ఈ నెల 22వ తేదీన జరగనున్న ప్రాణప్రతిష్ట కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రధాన అతిథిగా విచ్చేయనున్నారు. ఆ రోజు గర్భగుడిలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయనున్నారు. బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) ఆ విగ్రహానికి పేరు పెట్టనున్నారు. ఆయన ఏ పేరు పెడతారనేది 22వ తేదీన తెలియనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే కాశీకి(Kashi) చెందిన పండితులు అయోధ్యకు చేరుకున్నారు. బాలరామునికి ఏ పేరు పెట్టాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయిస్తుందని వారు చెప్పారు. విగ్రహానికి నామకరణం చేసే విషయమై ట్రస్టు సభ్యులు శాస్త్ర నిపుణులతో చర్చిస్తున్నారు.అయోధ్యకు తరలివచ్చిన పండితులు(Pandits) ముందుగా రామనగరిలో స్థానిక దేవతలుగా పూజలందుకుంటున్న దేవతలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. ఏదైనా శుభ కార్యం, పూజలు లేదా ఆచారాల నిర్వహణకు స్థానికులు ఇక్కడి దేవతలను పూజిస్తుంటారు. ఆ ఆనవాయితీని అనుసరించి పండితులు ముందుగా హనుమాన్‌గర్హిలో కొలువైన హనుమంతుడికి(Lord Hanuman), శివుని పౌరాణిక పీఠమైన నాగేశ్వరనాథ్, సరయూమాత, కనక్ బిహారీ సర్కార్ దేవతలకు ఆహ్వానం అందించారు. పండితులు ఈ ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. మీ నగరంలో భారీ కార్యక్రమం జరగబోతున్నదని, మీరు వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలలో పాల్గొనాలని అభ్యర్థించారు.