మోడీ ఎప్పుడూ అందరితో పాటు తాను.. అన్నట్టుగా ఉండడానికి ఇష్టపడరు.
మోడీ ఎప్పుడూ అందరితో పాటు తాను.. అన్నట్టుగా ఉండడానికి ఇష్టపడరు. ప్రత్యేకంగా ఉండడానికి ప్రాధాన్యతనిస్తారు. ఆయన సోషియల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అందరు పొలిటీషియన్స్ కన్నా అప్ డేటెడ్ గా ఉంటారు. ఇదే, మోదీ దృష్టి సోషియల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ వైపు చూసేలా చేసింది కావచ్చు. అందుకే ఆయన అందరూ పట్టించుకోకుండా వదిలేసిన పని, ప్రత్యేకంగా గుర్తించి చేసారు.
అవును మన తెలుగు మీడియా, నేషనల్ మీడియా ఒక చిన్న వార్తగా చూసి వదిలేసిన తెలుగు చాంపియన్ కోనేరు హంపిని ఆయన తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. అందరూ ఆమెను గురించి మాట్లాడుకునేలా చేసారు. మరి మోడీ కలిసాడంటే అది అందరు చూసే న్యూసేగా. అంతకుముందు సోషల్ మీడియా లో కొన్ని పేజీలు మాత్రం హంపిని గుర్తించడం లేదు అనే చర్చ చేశాయి.
కోనేరు హంపి FIDE worldwide women rapid chess championahip లో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. ఇది జరిగి వారంపైనే అయింది. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అదే స్థానం లో క్రికెట్ వరల్డ్ కప్ అయితే దేశం మొత్తం టి.వి. లు మారుమోగేలా వార్తలు వేసేది మీడియా. కానీ చెస్ చాంపియన్ ను మాత్రం పట్టించుకోలేదు. కనీసం తెలుగు మీడియా కూడా ఈ విషయాన్ని గొప్పగా హైలైట్ చెయ్యలేదు. మనం మన చాంపియన్లను గుర్తించకపోతే ఎలా.. ఇదే పని మోడీ చేసారు. ఆయన హంపిని పిలిచి అభినందించారు. హంపి కూడా ఇది లైఫ్ లో ఒక్కసారి మాత్రమే దొరికే గౌరవంగా భావిస్తున్నాను అని సంతోషపడింది.
మన నాయకులు సినిమా మీద పెట్టిన దృష్టి ఇలాంటి చాంపియన్ల మీద పెట్టకపోవడం దురదృష్టకరం.