అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆ నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. భారత చలనచిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని.. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారని.. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు.