నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ ట్విట్టర్ హ్యాండిల్‌లో.. "140 కోట్ల మంది భారతీయులతో పాటు నేను అటల్ బిహారీ వాజ్‌పేయి జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను.

President Murmu Pm Modi Lead Tributes To Vajpayee On 5th Death Anniversary
నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihar Vajpayee) వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) ఆయనకు నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ ట్విట్టర్(Twitter) హ్యాండిల్‌లో.. "140 కోట్ల మంది భారతీయులతో పాటు నేను అటల్ బిహారీ వాజ్‌పేయి జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మీ నాయకత్వం వల్ల దేశం ఎంతో ప్రయోజనం పొందింది" అని రాశారు. 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో మీది ముఖ్యమైన పాత్ర అని రాసుకొచ్చారు.
'సదైవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద అటల్ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్(Jagdeep Dhankhar), ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla), కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), హోంమంత్రి అమిత్ షా(Amit Shah) సహా పలువురు నేతలు కూడా ఆయన స్మారక చిహ్నం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.
