యాదాద్రి భువనగిరి(Bhuvanagiri) జిల్లా, భూదాన్ పోచంపల్లిలో(Pochamalli) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రేపు పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్(Bomb Squad) బృందాలు తనిఖీలు చేశాయి.హెలికాప్టర్ ట్రయల్ రన్(chopper Trail Run) కూడా నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

President Draupadi Murmu
యాదాద్రి భువనగిరి(Bhuvanagiri) జిల్లా, భూదాన్ పోచంపల్లిలో(Pochamalli) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రేపు పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్(Bomb Squad) బృందాలు తనిఖీలు చేశాయి.హెలికాప్టర్ ట్రయల్ రన్(chopper Trail Run) కూడా నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు రాష్ట్రపతి రాక సందర్భంగా భూదాన్ పోచంపల్లి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు సందర్శించి పరిశీలించారు. రేపు ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. ముందుగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్కులో ఉన్న వినోబావే విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత వినోబా మందిరంలో(Temple) ఫొటో ఎగ్జిబిషన్‌ని(Photo exhibition) పరిశీలిస్తారు. అనంతరం నేతన్నల ఇళ్లల్లోకి వెళ్లి.. వారి స్థితిగతులను అడిగి తెలుసుకుంటారు. అలాగే శ్రీరంజన్ పరిశ్రమలో పట్టుపురుగుల నుంచి పట్టు ద్వారాన్ని తీసి చీరల తయారీ కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి, పద్మశ్రీ సంత్ కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడతారు. ముఖ్యంగా తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింభించే విధంగా థీమ్ ఫెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, ముచ్చంపేట, నారాయణపేట, గద్వాల చీరల ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన ఉంటుందని అధికారులు తెలిపారు.
