ఇవాళ తెలంగాణలో(Telangana) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(draupadi murmu) పర్యటించనున్నారు.

ఇవాళ తెలంగాణలో(Telangana) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(draupadi murmu) పర్యటించనున్నారు. హైదరాబాద్(Hyderabad) నగరంలో నిర్వహించే లోక్ మంథన్ మహోత్సవంలో( Lok Manthan Festival) ఆమె పాల్గొననున్నారు. గిరిజన జాతరగా( Tribal Culture ) పేర్కొనే ఈ కార్యక్రమాన్ని తొలిసారి దక్షిణాది అయిన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొంటారు. వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ఆచార్య మిథిలేష్(acharya mithilesh), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala seetha raman), కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra singh shekawath) హాజరు కానున్నారు. భారత దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న జానపద కళాకారులందరినీ ఒకే వేదిక మీదకు చేర్చి కళ లను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పదిహేను వందలకు మందికి పైగా జానపద కళాకారులు పాల్గొంటారు. దీనికి మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా జానపద కళాకారులు హాజరవుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.. **

Eha Tv

Eha Tv

Next Story