Preganancy crime : కడుపు చేస్తే లక్షల రూపాయలు..!
టెక్నాలజీని(Technology) వాడుకోవడంలో సైబర్ నేరగాళ్లకు మించిన మనుషులు మరొకరుండరు. మనిషి బలహీనతలే అస్త్రంగా వాడి దొంగ దెబ్బ తీయడంలో ఈ మోసగాళ్లు దిట్ట. వీరు ప్రకటించే ఆఫర్లకు పడిపోతూ బొక్కబోర్లా పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా సైబర్ కేటుగాళ్లు(Cyber Criminals) ప్రయోగించిన మరో వ్యవహారం ఇప్పుడు మార్కెట్లో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో(Social Media) కొందరు తప్పుడు ఐడీలతో కొత్త కొత్త ప్రకటనలు చేస్తున్నారు. తాము కోట్లల్లో సంపాదిస్తున్నామని కానీ సంతానలేమితో బాధపడుతున్నామని.. ఇన్‌ఫర్టిలిటీతో(Infertility) బాధపడుతున్న మహిళలను గర్భవతులను చేస్తే పది నుంచి 15 లక్షలు(Lakhs) సంపాదించే అవకాశం లభిస్తుందని ప్రకటనలు ఇస్తూ నమ్మిస్తున్నారు. ఇది చూసిన కొందరు అమాయకులు, మరికొందరు కామాంధులు తమకు బంపరాఫర్ దొరికందని లొట్టలేసుకుంటూ.. ఈ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేస్తున్నారు. వారిచ్చిన టాస్క్‌లను(Task) పూర్తి చేస్తూ తమ ఖాతాల్లోనే ఉన్న నగదును పోగొట్టుకుంటున్నారు. బీహార్(Bihar), ఉత్తరప్రదేశ్(UP), ఢిల్లీలో(Delhi) ఇలాంటి మోసాల బారినపడి బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. భార్యాభర్తలుగా నటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వాటిని నమ్మి మోసపోకూడదని సూచిస్తున్నారు.