ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. నూతన కొత్త న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ నియామకాలను ట్విట్టర్‌లో ప్రకటించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే.. ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియామకం జరగడం విశేషం.

Prashant Mishra, KV Viswanathan to take oath as Supreme Court judges today
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా(Prashant Kumar Mishra), సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్(KV Viswanathan)లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు(Supreme Court judges)గా నియమితులయ్యారు. నూతన కొత్త న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(Law Minister Arjun Meghwal)ఈ నియామకాలను ట్విట్టర్‌లో ప్రకటించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు(Supreme Court Collegium) చేసిన 48 గంటల్లోనే.. ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియామకం జరగడం విశేషం. ప్రశాంత్ కుమార్ మిశ్రా, విశ్వనాథన్‌ల చేత శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్(DY Chandrachud) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి సిఫారసు చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం వీరి పేర్లను సిఫారసు చేసింది. జస్టిస్ మిశ్రా 10 డిసెంబర్ 2009న చత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన 13 అక్టోబర్ 2021న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి(Dinesh Maheshwari), జస్టిస్ ఎంఆర్ షా(MR Shah) గత రెండు రోజుల క్రితం పదవీ విరమణ చేశారు. జస్టిస్ కేఎం జోసెఫ్(KM Joseph) జూన్ 16, 2023న, జస్టిస్ అజయ్ రస్తోగి(Ajay Rastogi) జూన్ 17న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యం(Subramanyam) జూన్ 29న, జస్టిస్ కృష్ణ మురారి(Krishna Murari) జూలై 8న పదవీ విరమణ చేయనున్నారు.
ప్రధాన న్యాయమూర్తితో పాటు, కొలీజియంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. జూలై రెండో వారంలో మరో నాలుగు ఖాళీలు ఉంటాయని కొలీజియం తన సిఫార్సులో పేర్కొంది. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 30కి తగ్గనుంది.
