ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో గతంలో మీరు చెప్పిన జోస్యం కరెక్ట్ అవ్వలేదు కదా యాంకర్ అడగ్గా

ప్రశాంత్ కిషోర్.. ఒకప్పుడు దేశంలోని పలువురు నాయకులను గెలిపించాననే పాపులారిటీని సొంతం చేసుకున్న వ్యక్తి. అయితే ఎలెక్షన్ స్ట్రాటజిస్టు పదవిని వదులుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. అయితే ప్రజల నుండి అనుకున్నంత స్పందన రాలేదు. ఇక ఏపీలో ఈయన్ను టీడీపీ భుజాన వేసుకుంది. ప్రశాంత్ కిషోర్ కూడా టీడీపీకి.. కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో గెలిచేది కూటమి అంటూ జోస్యం చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ప్రశాంత్ కిషోర్ ను లైట్ తీసుకోవాలని బహిరంగంగానే చెబుతున్నారు వైసీపీ నేతలు.

ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో గతంలో మీరు చెప్పిన జోస్యం కరెక్ట్ అవ్వలేదు కదా యాంకర్ అడగ్గా.. ప్రశాంత్ కిషోర్ కు బాగా మండింది. ఏదేదో చెప్పాలని ప్రయత్నించి ఏదీ చెప్పలేక చేతులెత్తేశాడు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయ్యాడు. తాను జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనని.. హిమాచల్ లో కాంగ్రెస్ గెలుస్తుందని తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు, ప్రముఖ వెబ్‌ సైట్‌ లు ఈ వార్తను ప్రచురించాయని గుర్తుచేశారు. ఆగ్రహంతో పత్రికలు, వెబ్ సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తాయని అన్నారు. కరణ్‌ థాపర్‌ తన ప్రశ్నను వివరించేందుకు ప్రయత్నించినా పీకే వినలేదు. కరణ్‌ థాపర్‌ తెలంగాణలోనూ బీఆర్ ఎస్ గెలుస్తుందంటూ చెప్పిన జోస్యం ఫలించలేదని గుర్తుచేశారు. ఇంటర్వ్యూ పేరుతో తనను భయపెట్టాలని చూసినా తాను భయపడబోనని సంబంధం లేకుండా వ్యాఖ్యానించారు.

Updated On 23 May 2024 1:04 AM GMT
Yagnik

Yagnik

Next Story