ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో(AP Elections) ఈ సారి వైసీపీ ఘోర పరాభావం మూట కట్టుకోనుందని ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(Prashnath Kishore) మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ప్రముఖ జర్నలిస్టుకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో(AP Elections) ఈ సారి వైసీపీ ఘోర పరాభావం మూట కట్టుకోనుందని ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(Prashnath Kishore) మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ప్రముఖ జర్నలిస్టుకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో 151 కంటే ఎక్కువే వస్తాయన్న జగన్‌(Jagan) వ్యాఖ్యలపై ఈ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. రాజకీయనాయకులు ఓటమిని ఎప్పుడూ అంగీకరించరని.. కౌంటింగ్‌లో నాలుగు రౌండ్లు వెనకబడినా కూడా మిగతా రౌండ్లలో తనకే ఆధిక్యం వస్తుందని ఆయన అన్నారు. ఏపీ సీఎం జగన్‌ చెప్పినట్లే రాహుల్ గాంధీ(Rahul gandhi) తేజస్వియాదవ్, అమిత్ షా కూడా ఇదే చెప్తారని.. పదేళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నానని ఫలితాలను ముందే పసిగడతానని పీకే చెప్పుకొచ్చారు. చంద్రబాబు తాను గెలుస్తానని చెప్తే, జగన్‌ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని, ఈ చర్చకు ఇక అంతమే ఉండదన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశంలో బీజేపీ, మోడీలపై అసంతృప్తి ఉన్నా కానీ ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని బర్కాదత్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated On 20 May 2024 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story