తలపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆవిర్భావ దినోత్సవాన్ని మహాబలిపురంలో నిర్వహించారు.

తలపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆవిర్భావ దినోత్సవాన్ని మహాబలిపురంలో నిర్వహించారు. ఈ వేదిక నుంచి వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ వేదికపై విజయ్‌తో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఉన్నారు. ఇటీవలే విజయ్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ అనేక విషయాలపై చర్చించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడానికి అంగీకరించారు. ఆ పార్టీ ప్రత్యేక సలహాదారుడుగా వ్యవహరిస్తానని, తన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తానని పీకే విజయ్‌కు హామీ ఇచ్చారు. జయలలిత మృతి తర్వాత నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే అధికార డీఎంకేకు వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ తప్పదు. ఇక, గత ఎన్నికల్లో డీఎంకే వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఈసారి విజయ్ కోసం వ్యూహాలు రచించనున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిషర్‌ మాట్లాడుతూ.. సీఎస్‌కేను ధోనీ ఎలా గెలిపిస్తున్నారో, టీవీకేను తాను గెలిపిస్తానన్నారు. తలపతి విజయ్ (TVK)పార్టీని గెలిపిస్తే ధోని కన్నా నాకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుందని పీకే అన్నారు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు విజయ్‌ను విజయతీరాలకు తీసుకెళ్తాయనేది 2026 వరకూ ఆగక తప్పదు.

ehatv

ehatv

Next Story