ఈసారి 400 సీట్లు దాటడం పక్కా అని గొప్పలు చెప్పుకుంటున్న భారతీయ జనతాపార్టీకి(BJP) అంత సీన్ లేదంటున్నారు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(Prashanth Bhushan) అన్నారు. బీజేపీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉదందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచార(ELection Campaign) సభలలో ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra) చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు.
ఈసారి 400 సీట్లు దాటడం పక్కా అని గొప్పలు చెప్పుకుంటున్న భారతీయ జనతాపార్టీకి(BJP) అంత సీన్ లేదంటున్నారు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(Prashanth Bhushan) అన్నారు. బీజేపీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉదందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచార(ELection Campaign) సభలలో ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra) చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో తాము చేసినదేమిటో చెప్పకుండా, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా మంగళసూత్రాలు, గేదెలు, ముస్లింలు ఆస్తులు లాగేసుకుంటారని ఇంకా చాలా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఈ ఎన్నికలు తన పట్టు నుంచి జారిపోతున్నాయని ప్రధాని మోదీ గ్రహించారని, అందుకు నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. వివిధ కారణాల వల్ల బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతటా బలమైన సెంటిమెంట్ ఉందని, బీజేపీ వల్ల ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించడం, ప్రతిపక్షాలకు డబ్బు అందకుండా చేయడం వంటి వాటి వల్ల ప్రజల్లో భారతీయ జనతాపార్టీపై తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. ఆ పార్టీ చేస్తున్న మతపరమైన ప్రచారం కూడా బీజేపీ దిగజారిపోవడానికి కారణమన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని ఇష్టపడరని, దేశాన్ని బలహీనపరిచేలా మతం ఆధారంగా దేశాన్ని చీల్చే ప్రయత్నంగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఈసారి అధికారంలోకి రాబోదని, 200 స్థానాలు వస్తే మహా ఎక్కువ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.