మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోసం ఢిల్లీలో ప్రత్యేక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోసం ఢిల్లీలో ప్రత్యేక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు. డాక్టర్ సింగ్ అంత్యక్రియల కోసం ఢిల్లీలో స్థలం కేటాయించాలని, తద్వారా స్మారక చిహ్నాన్ని తరువాత నిర్మించాలని కోరుతూ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. డాక్టర్ సింగ్ 92 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో డిసెంబర్ 26వ తేదీ రాత్రి కన్నుమూశారు. అయితే ప్రణబ్ ముఖర్జీ శర్మిష్ట కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ముఖర్జీ ఆగస్టు 2020 లో మరణించినప్పుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సంతాప సభ కోసం పిలవలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తనను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఆమె తన పోస్ట్‌లో, "బాబా మరణించినప్పుడు, కాంగ్రెస్ సంతాప సభకు సీడబ్ల్యూసీని పిలవలేదన్నారు. రాష్ట్రపతి కోసం ఇది చేయలేదని ఒక సీనియర్ నాయకుడు నాతో అన్నారు. KR నారాయణన్ మరణం, CWCని పిలిచారు. ప్రణబ్ ముఖర్జీ మాత్రమే సంతాప సందేశాన్ని రూపొందించారు.
భారత రాష్ట్రపతికి పార్టీ కార్యవర్గం సంతాప సభలను ఏర్పాటు చేయడం సంప్రదాయం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తన తండ్రి మరణించిన సమయంలో తనకు చెప్పారన్నారు. అయితే, వాస్తవానికి మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ మరణించిన తరువాత సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేశారని ప్రణబ్ ముఖర్జీ స్వయంగా సంతాప సందేశాన్ని రూపొందించారన్నారు. ఈ విషయం తన తండ్రి డైరీల ద్వారా తెలిసిందని శర్మిష్ట అన్నారు.
కాంగ్రెస్ మాజీ నాయకుడు సిఆర్ కేశవన్ చేసిన పోస్ట్‌ను ఉటంకిస్తూ శర్మిష్ట ముఖర్జీ పోస్ట్ రాశారు, గాంధీ కుటుంబంలో భాగం కాని పార్టీ నాయకులను కాంగ్రెస్ ఎలా పక్కన పెడుతుందో తన పోస్ట్‌లో హైలైట్ చేసింది. డాక్టర్ సంజయ బారు రాసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకాన్ని కేశవన్ ప్రస్తావించారు. 2004లో మరణించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొంది.