పారిస్‌ ఒలింపిక్స్‌లో(Paris olympics) అనర్హత కారణంగా స్వర్ణం గెలుచుకోలేకపోయిన బంగారుతల్లి వినేశ్‌ ఫోగట్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో(Paris olympics) అనర్హత కారణంగా స్వర్ణం గెలుచుకోలేకపోయిన బంగారుతల్లి వినేశ్‌ ఫోగట్‌కు(Vinesh phogat) దేశం మొత్తం అండగా నిలిచింది. ఓదార్చింది. బంగారాన్ని గెల్చుకోలేకపోతేనేం నువ్వు బంగారానివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సంచలన నటుడు ప్రకాశ్‌ రాజ్‌(Prakash raj) వినూత్నంగా స్పందించాడు. ఫైనల్‌కు ముందు వినేశ్‌ ఫోగట్‌ బరువును చెక్‌(Weight check) చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కాలును ఉంచినట్టు ఉన్న కార్టూన్‌ను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీని గురించి మీరు ఏం అనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. కాలు పెట్టిన వ్యక్తి ఎవరో ఇట్టే ఊహించవచ్చు. అందుకే రైట్ వింగ్‌ మొత్తం ఎప్పటిలాగే ప్రకాశ్‌రాజ్‌పై విరుచుకుపడుతున్నది. ట్రోల్‌ చేస్తున్నది. అనరాని మాటలు అంటున్నది. మరి మీరు ఏమనుకుంటున్నారు?





Updated On 8 Aug 2024 3:32 AM GMT
Eha Tv

Eha Tv

Next Story