సెక్స్ స్కాండల్ కేసులో(Sex scandal case) చిక్కుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ(Dev gowd) మనవడు, జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రెవణ్ణ(Prajwal revanna) ఓడిపోయారు. తన సొంత నియోజకవర్గం హసన్(Hasan) నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ కాంగ్రెస్(Congress) అభ్యర్థి శ్రేయస్ ఎం.పాటిల్ చేతిలో 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన మరుసటి రోజున ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ బయటపడింది కానీ ముందే వెలుగులోకి వచ్చి ఉంటే దారుణంగా ఓడిపోయేవాడు.
సెక్స్ స్కాండల్ కేసులో(Sex scandal case) చిక్కుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ(Dev gowd) మనవడు, జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రెవణ్ణ(Prajwal revanna) ఓడిపోయారు. తన సొంత నియోజకవర్గం హసన్(Hasan) నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ కాంగ్రెస్(Congress) అభ్యర్థి శ్రేయస్ ఎం.పాటిల్ చేతిలో 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన మరుసటి రోజున ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ బయటపడింది కానీ ముందే వెలుగులోకి వచ్చి ఉంటే దారుణంగా ఓడిపోయేవాడు. కౌంటింగ్ మొదలైనప్పుడు ప్రజ్వల్ ఆధిక్యంలోకి ఉన్నాడు. తర్వాత వెనుకంజలోకి వెళ్లిపోయాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో హసన్ నుంచి ప్రజ్వల్ గెలుపొందాడు. ఈసారి మాత్రం బీజేపీతో పొత్తుతో జేడీ(ఎస్) కర్ణాటకలో పోటీ చేసింది. మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలతో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రజ్వల్‌కు నిన్న వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రజ్వల్‌ను సిట్ అధికారులు అంబులెన్స్‌లో సోమవారం శివాజినగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన మూడు, నాలుగు రకాల వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులను కోరారు. దీంతో మెడికల్ కాలేజీ డీన్, సూపరింటెండెంట్ సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజ్వల్‌ను కస్టడీకి తీసుకుని మూడు రోజులు గడిచింది. ఏ ప్రశ్న అడిగినా తాను తప్పు చేయలేదని, ఇదంతా రాజకీయ కుట్ర అని, తనను రాజకీయంగా వేధిస్తున్నారని చెబుతున్నారు.