క‌ర్ణాట‌క ఎన్నిక‌ల(karnataka Elections) వేళ‌ రాష్ట్రం మొత్తం చిక్బల్లాపూర్ నియోజకవర్గం వైపు చూసింది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితం దేశ‌వ్యాప్తంగా మారుమోగుతుంది. ఏం జ‌రిగింది అక్క‌డ‌..?

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల(karnataka Elections) వేళ‌ రాష్ట్రం మొత్తం చిక్బల్లాపూర్(Chikballapur) నియోజకవర్గం వైపు చూసింది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితం దేశ‌వ్యాప్తంగా మారుమోగుతుంది. ఏం జ‌రిగింది అక్క‌డ‌..? ఎనిమిదేళ్ల క్రితం సామాన్యుడిగా ఉన్న ఓ కుర్రాడు.. నేడు పలుకుబడి ఉన్న మంత్రిని ఓడించాడు. ఎస్ ఇది జ‌రిగింది. చరిత్ర సృష్టించిన ఆ పేరు ప్రదీప్ ఈశ్వర్(Pradeep Eshwar).

ప్రదీప్ ఈశ్వర్.. మంత్రి డాక్ట‌ర్ కె సుధాక‌ర్‌(K. sudhaker) స్వగ్రామం పేరేసంద్రకు చెందినవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి కష్టాల్లో పెరిగాడు. తుమకూరులోని సిద్దగంగ మఠంలో విద్యాభ్యాసం అనంతరం నగరంలోని కళాశాలలో పీయూసీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. ఓబీసీ బలిజ వర్గానికి చెందిన ప్రదీప్ ఈశ్వర్.. కోచింగ్ సెంటర్లలో బోధిస్తూ కొన్ని కాలేజీల్లో లెక్చరర్‌గా కూడా పనిచేశాడు.

2016లో మొదటిసారి ప్రదీప్ ఈశ్వర్ పేరు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. దేవనహళ్లి సమీపంలోని విజయపురాన్ని తాలూకా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఆ నిరసన విఫలమైన తర్వాత.. ఆయ‌న‌ స్థానిక టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా పనిచేయడం ప్రారంభించాడు. తర్వాత యూట్యూబ్‌లో కనిపించిన ప్రదీప్ ఈశ్వర్.. డాక్టర్ కె సుధాకర్‌పై చిన్న చిన్న వీడియోలు చేయ‌డం ప్రారంభించాడు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ కే సుధాకర్‌తో ప‌రోక్షంగా తలపడ్డాడు. సుధాకర్‌ కు వ్యతిరేకంగా చాలా వీడియోలు చేశాడు. పార్టీలకతీతంగా సుధాకర్‌పై పోటీ చేసిన కేవీ నవీన్‌కిరణ్ కు జోరుగా ప్రచారం నిర్వహించి సందడి చేశాడు. ఫ‌లితంగా ప్రదీప్ ఈశ్వర్ పై అనేక కేసులు నమోదయ్యాయి. దాదాపు 20 కేసులు పెట్టి జైల్లో పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య సపోర్ట్ చేసి బయటకు తీసుకువ‌చ్చాడు. అనంత‌రం బెంగుళూరు వెళ్లాడు. చిన్న‌గా ప్రారంభించిన నీట్ అకాడ‌మీని రాష్ట్రం మొత్తం చూసేలా అబివృద్ధి చేసి చూపించాడు.

ఆ త‌ర్వాత‌ భారత్ జోడో యత్రలో రాహుల్ గాంధీని కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, తనకు సీటు కావాలని అడిగాడు. రాహుల్ గాంధీ ఒక్క క్షణం అతని వైపు చూసి.. పార్టీ నాయకత్వంతో మాట్లాడాడు.. అతనికి సీటు వచ్చింది. బీజేపీ తరుపు నిలబడింది కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి. ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. ఎంతోమంది సినీ నటులను ప్రచారానికి పిలిపించుకున్నాడు. అందులో మన బ్రహ్మానందం ఒకరు. ఓటుకి వేలు పంచారు. అయినప్పటికీ చిక్బల్లాపూర్ ప్రజలు.. డాక్ట‌ర్‌ సుధాకర్ ని ఓడించి టీచ‌ర్‌ ప్రదీప్ ఈశ్వర్‌ని గెలిపించుకున్నారు. కారణం ప్రదీప్ ని అక్రమంగా జైలుకు పంపించడమే బీజేపీ చేసిన తప్పు.

ప్రదీప్ ఈశ్వర్ ఎన్నిక‌ల‌లో ఒక రూపాయి కూడా పంచలేదు. చిక్బల్లాపూర్ ప్రజలకు హెల్త్ మినిస్టర్ కావాలా.. హెల్త్ టీచర్ కావాలా అని అడిగాడు. హెల్త్ టీచరే కావాలి అంటూ చిక్బల్లాపూర్ ప్రజలు ప్రదీప్ ఈశ్వర్ వెంట నిలిచారు.

గెలిచాక ప్రదీప్ ఈశ్వర్ మాట్లాడుతూ.. నేను ద్వేషపూరిత రాజకీయాలు చేయను. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాను. నగరంలో ఇల్లు కట్టుకోను. ప్రతిరోజు 4 గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పందిస్తాను. నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం అని అన్నారు.

Updated On 16 May 2023 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story