యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటించిన సలార్‌(Salaar) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక వాయిదాల అనంతరం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఉందని రివ్యూలు చెబుతున్నాయి.

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటించిన సలార్‌(Salaar) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక వాయిదాల అనంతరం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఉందని రివ్యూలు చెబుతున్నాయి. ప్రశాంత్‌ నీల్‌(Prashanth neel) దర్శకత్వంలో హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై(Hombale Films banner) విజయ్‌ కిరగందూర్‌ సినిమాను నిర్మించారు. మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రభాస్‌ కరువు తీర్చింది. ఇక ఈ సినిమా కథ అంతా ఖన్సార్‌(Khansar) అనే ఊహాజనిత నగరం చుట్టూ తిరుగుతుంది. పాకిస్తాన్‌(Pakisthan)- గుజరాత్‌(Gujarat) మధ్య ఈ ప్రాంతం ఉందని సినిమాలో చూపించారు. అయితే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలిసి పెట్టాడో, తెలియక పెట్టాడో తెలియదు కానీ నిజంగానే ఖాన్సార్‌ అనే నగరం ఉంది. అదేం ఊహాజనిత నగరం కాదు. ఇరాన్‌(Iran) దేశంలోని ఒక కౌంటీ పేరు ఖన్సార్‌. ఈ కౌంటీలో సుమారు 22 వేల మంది పర్షియన్లు నివసిస్తున్నారు. అయితే సలార్‌ సినిమాలో చూపించిన ఖన్సార్‌కు అసలైన ఖన్సార్‌ నగరానికి చాలా తేడా ఉంది.

Updated On 22 Dec 2023 7:36 AM GMT
Ehatv

Ehatv

Next Story