భారతదేశంలో పేదరికం తగ్గుతోందని నీతి అయోగ్‌ తెలిపింది. తాజా సర్వేలో భారత్‌లో

భారతదేశంలో పేదరికం తగ్గుతోందని నీతి అయోగ్‌ తెలిపింది. తాజా సర్వేలో భారత్‌లో పేదరికం ఎంత మేర తగ్గిందో తెలిపింది. దీన్ని గృహ వినియోగం సర్వేని ఆధారంగా చేసుకుని అంచనా వేసింది. భారతదేశంలో పేదరికం ఐదు మేర తగ్గిందని నీతి అయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ప్రకారం గ్రామీణ , పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ 2.5 పెరుగుదల కనిపించింది.

పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5% మేర పెరిగి రూ. 3,510కి చేరుకుంది. గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42% పెరుగుదలలో రూ. 2,008కి చేరుకుంది. ఈ డేటాల ఆధరాంగా దేశంలో పేదరికం 5% లేదా అంతకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది. ఆహార వ్యయం పరంగా గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50% కంటే తక్కువ ఆహారం కేటాయించినట్లు సర్వే తెలిపింది. పట్టణ గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91% నుంచి 2022-23 నాటికి 71% తగ్గిందని సర్వే పేర్కొంది.

Updated On 26 Feb 2024 1:01 AM GMT
Yagnik

Yagnik

Next Story