సాధారణంగా వర్షాకాలంలో పచ్చికూరగాయలు, పండ్ల ధరలు పెరుగుతాయని, అయితే ఈసారి ధరలు గతంతో పోల్చితే భాగా పెరిగినట్లు తెలుస్తోంది. టమాటా ధర కిలో రూ.150కి చేరింది. అదే సమయంలో మిర్చి ధర కూడా జనాన్ని కంటతడి పెట్టిస్తుంది. అల్లం-పచ్చిమిర్చి ధర కిలో రూ.400కి చేరింది. పచ్చిమిర్చి దేశ రాజధానిలో రూ.100 పలుకగా.. కోల్‌కతాలో కిలో రూ.350-400కి చేరింది.

Potato-Onion Can Also Become Expensive After Tomato, Increased Prices Of These Vegetables
సాధారణంగా వర్షాకాలంలో పచ్చికూరగాయలు(Vegetables), పండ్ల(Fruits) ధరలు పెరుగుతాయని, అయితే ఈసారి ధరలు(Prices) గతంతో పోల్చితే భాగా పెరిగినట్లు తెలుస్తోంది. టమాటా ధర(Tomota Price) కిలో రూ.150కి చేరింది. అదే సమయంలో మిర్చి ధర కూడా జనాన్ని కంటతడి పెట్టిస్తుంది. అల్లం(Potato)-పచ్చిమిర్చి(Mirchi) ధర కిలో రూ.400కి చేరింది. పచ్చిమిర్చి దేశ రాజధానిలో రూ.100 పలుకగా.. కోల్‌కతాలో కిలో రూ.350-400కి చేరింది. అదే సమయంలో అల్లం(Ginger)కూడా కిలో రూ.350కి విక్రయిస్తున్నారు. కాగా, ధరల పెంపు తాత్కాలికమేనని ప్రభుత్వం పేర్కొంది. రానున్న 15 నుంచి 30 రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు
మే చివరి వారం, జూన్ మొదటి వారంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, వేడి గాలుల ప్రభావంతో దాదాపు అన్ని నిత్యావసర కూరగాయల ధరలు పెరిగాయని అంటున్నారు. ముఖ్యంగా టమాటా ధర ఎక్కువగా పెరుగుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా త్వరలో కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇది మారుమూల ప్రాంతాల నుండి సరకుల రవాణాపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో జూన్ 2 నుంచి జూలై 3 మధ్య టమాటా ధర క్వింటాల్‌కు రూ.451 నుంచి రూ.6,381కి పెరిగింది. ఈ కాలంలో టమోటాల రాక 40 శాతం తగ్గింది. టొమాటో పండించే కొన్ని ప్రధాన ప్రాంతాలలో టమోటా పంట వైఫల్యం ఫలితంగా కొరత ఏర్పడింది.
మార్చి-ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల కారణంగా పంట దెబ్బతింది. కర్ణాటకలో టమోటా పంటలకు తెగుళ్లు వచ్చి చాలా పంట నష్టపోయారు రైతులు. టమాటా స్వల్పకాలిక పంట. కర్నాటక టమాటా ప్రధాన ఉత్పత్తిదారు. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), గుజరాత్(Gujarat) ఉన్నాయి. దేశంలోని మొత్తం వార్షిక టమోటా ఉత్పత్తిలో ఈ 4 రాష్ట్రాల వాటా దాదాపు 48 శాతం.
ఇక మార్కెట్‌లో క్యాలీఫ్లవర్(Cauliflower) కిలో రూ.150కి విక్రయిస్తున్నారు. జామకాయలు(Guava) కిలో రూ.100 పలుకుతున్నాయి. వంకాయల ధర కిలో రూ.70. ఇరవై రోజుల క్రితం మార్కెట్‌లో కూరగాయల ధరలు మాములుగానే ఉన్నాయి. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పొలాల్లోనే కూరగాయల పంట దెబ్బతింది.
వారం రోజులుగా ధరలు పెరిగిన ఏకైక వస్తువు టమోటా మాత్రమేనని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్(Piyush Goel) తెలిపారు. అకాల వర్షాల కారణంగా టమాటా ధరలు పెరిగాయన్నారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), కర్ణాటక(Karnataka)తో పాటు మరికొన్ని ప్రాంతాల నుండి టమోటాలు మార్కెట్‌లోకి రావడంతో.. ధరలు తగ్గుతాయి. గత ఏడాది ధరలతో పోల్చి చూస్తే పెద్దగా తేడా లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బంగాళదుంపలు, ఉల్లి ధరలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు.
