ప్రభుత్వం ఇటీవల చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచింది. దీని తరువాత, పోస్టాఫీసు(Post Office) అందించే పొదుపు పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పై వడ్డీ రేటు ప్రభుత్వం పెంచింది . దాదాపు 7.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది , ఇది బ్యాంక్ FD కంటే చాలా ఎక్కువ .
టాక్స్ ఆదా చేసే FD విధానంలో , సాధారణ FDలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం నుండి ప్రత్యేక పన్ను ప్రయోజనం ఉండదు. అటువంటి పరిస్థితిలో, సురక్షితమైన పెట్టుబడితో పన్ను ఆదా చేయాలనుకునే పెట్టుబడిదారులకు ఈ పథకం చాల ప్రయోజనమైంది NSC పూర్తి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం...

NSCలో కనీస పెట్టుబడి:
NSC కార్యాలయం ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. అందువలన , ఇది బ్యాంక్ ఎఫ్‌డి లానే చాలా సురక్షితం అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుకి ఎలాంటి రిస్క్ ఉండదు . కనీసం 1000 రూపాయల పెట్టుబడితోNSC పొదుపు మొదలు పెట్టచ్చు .దీని లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు.

NSCలో పన్ను ఆదా:
ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎస్‌సి(NSC)లో పెట్టుబడి పెట్టిన రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద మినహాయింపు ఉంటుంది అలాగే మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి తీసుకోబడుతుంది .

లాక్ ఇన్ పీరియడ్(lock-in period):
మీరు ఎన్‌ఎస్‌సిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఐదేళ్ల తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో, గడువు పూర్తయ్యేలోపుతీసుకొనే అవకాశాన్ని ఇవ్వటం జరగలేదు .ఒక వేళ చందాదారుడు ఆకస్మిక మరణంచెందితే కోర్టు ఆర్డర్ తర్వాత మాత్రమే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోనే అవకాశం ఉంటుంది .

రుణ సౌకర్యం:
బ్యాంకులు ఎన్‌ఎస్‌సిపై రుణ సదుపాయాన్ని అందిస్తాయి. బ్యాంకులో తనఖా పెట్టి సులభంగా రుణం తీసుకోవచ్చు.

Updated On 10 April 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story