జగన్మాతకు పేర్లు ఎన్ని ఉన్నా, ఎన్ని అవతారాలలో కనిపించినా, ఎన్ని రూపాలలో కొలువుదీరినా, ఆదిదేవి ఒక్కరే!
జగన్మాతకు పేర్లు ఎన్ని ఉన్నా, ఎన్ని అవతారాలలో కనిపించినా, ఎన్ని రూపాలలో కొలువుదీరినా, ఆదిదేవి ఒక్కరే! మహాపరాక్రమశాలి ఆమె! మనల్ని సకల విద్యాపారంగతులను చేసినా.. సకల సంపదలకు అధిపతిని చేసినా... బలపరాక్రమవంతుడిగా తీర్చిదిద్దినా అది ఆమె కారుణ్యమే...! అందుకే దసరా వేళ భక్తులు దేవిని మనసారా కొలుస్తారు.. ఆదుకొమ్మని అభివృద్ధిని కలిగించమని వేడుకుంటారు.
రాజస్తాన్‌లోని(Rajasthan) కోట(Kota) పట్టణంలో దసరా సంబరాలు(Dasara celebrations) సరదాసరదాగా సాగుతాయి.. ఉత్సవంలో భాగంగా బ్రహ్మాండమైన మేళ(Festival mela) జరుగుతుంది.. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తిదారులు తమ వస్తువులను అమ్ముకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలు అయితే లెక్కలేనన్ని జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఒక్కటవుతారు.. అంతా సంప్రదాయ దుస్తులే(Traditional wearing) ధరిస్తారు.. రావణుడిపై(Ravan) విజయం సాధించిన శ్రీరామచంద్రుడికి(God Ram) పూజలు చేస్తారు.. రామ్‌లీల(Ram Leela) ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజున దాదాపు 75 అడుగుల ఎత్తున్న రావణుడు, కుంభకర్ణుడు.. మేఘనాథుడి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇదో ప్రతీకగా భావిస్తారు వారు. ఈ మూడు బొమ్మల్లో బాణాసంచాను నింపుతారు.. రాముడి వేషంలో ఉన్న ఓ బాలుడు రావణుడి బొమ్మపైకి నిప్పుతో కూడిన బాణాన్ని సంధిస్తాడు.. అంతే ఒక్కసారిగా ఆ మూడు బొమ్మలు మంటలకు ఆహుతవుతాయి.. ఈ దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది.
ప్రధాన ఆకర్షణ చంబల్‌నది పక్కనే ఉన్న రాయల్ ప్యాలెస్‌లో జరిగే వేడుకలే! ఏనుగులను.. ఒంటెలను.. గుర్రాలను చక్కగా అలంకరించి ఊరేగిస్తారు. పండుగ ప్రారంభం నుంచి దసరా వరకు కళాకారుల్లో అదే ఉత్సాహం.. అదే అల్లాసం.. ఎక్కడా అలసట చెందరు.. డాన్సులు.. కచేరీలు.. పాటలు.. ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆనందపరవశులను చేస్తాయి.. దాదాపు లక్షమంది ఈ వేడుకలకు హాజరవుతారు. నవరాత్రుల సందర్భంగా జరిగే మేళా గ్రామీణ ప్రజలకు ఓ వరం లాంటిది.. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి వ్యాపారులు వస్తారు.. దేవీదేవతల చిన్నచిన్న మూర్తులు కళాకారుల నైపుణ్యానికి అద్దంపడతాయి.. ఈ మేళాకు దాదాపు మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది.. మహ్రావ్ దుర్జన్‌షాల్ సింగ్ హడ పాలనలో దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి.. అప్పుడే రామ్‌లీల ఉత్సవం కూడా మొదలయ్యింది.. ఆ తర్వాత హడ వంశస్తులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు.. స్వాతంత్ర్యానికి ముందు వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన మహ్రావ్ ఉమ్మద్ సింగ్ కాలంలో ఈ పండుగ వేడుకలు కొత్త రంగులు అద్దుకున్నాయి.. ఇప్పుడు దసరా ఉత్సవాలు 25 రోజుల పాటు జరుగుతున్నాయి..