అత్యంత ధనవంతుడు, అపర కుబేరుడు అయిన అంబానీ(Ambani) ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే మామూలుగా ఉండదు. దేశంలోని అతిరథ మహారథులందరూ తరలివస్తారు. పదహారు రోజుల పెళ్లి కాదు కానీ అయిదు రోజులయితే విందులు, వినోదాలు పసందుగా ఉంటాయి.

అత్యంత ధనవంతుడు, అపర కుబేరుడు అయిన అంబానీ(Ambani) ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే మామూలుగా ఉండదు. దేశంలోని అతిరథ మహారథులందరూ తరలివస్తారు. పదహారు రోజుల పెళ్లి కాదు కానీ అయిదు రోజులయితే విందులు, వినోదాలు పసందుగా ఉంటాయి. అనంత్‌ అంబాని(Ananth Ambani), రాధిక(Radhika) వివాహానికి నాలుగు నెలల ముందునుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికీ జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు. శుక్రవారం పాప్‌ సింగర్‌ రిహాన్నా(Rihana) ఆహుతలను ఆటపాటలతో అలరించింది. ఇండియాలో ఆమెకు ఇదే తొలి లైవ్‌ పర్ఫార్‌మెన్స్‌. తన ప్రదర్శనకు ముందు ఆమె అంబానీ ఫ్యామిలీకి థాంక్స్‌ చెప్పుకుంది. అలాగే కాబోయే కొత్త జంట అనంత్‌-రాధికిలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రిహన్నాకు పెళ్లి కూతురు పేరు కూడా పలకడ రావడం లేదని కొందరు నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. ముప్పాతిక కోట్లు పారితోషికంగా పొందినప్పుడు ఆ జంట పేర్లను బట్టి పట్టాల్సిందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Updated On 2 March 2024 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story