బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే(Poonam Pandey) చనిపోయినట్టు సోషల్‌ మీడియాలో(Social media) వార్తలు వస్తున్నాయి. గర్భాశయ కేన్సర్‌తో(cervical cancer) పూనమ్‌ పాండే మరణించారని పూనమ్‌ పాండే రియల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే(Poonam Pandey) చనిపోయినట్టు సోషల్‌ మీడియాలో(Social media) వార్తలు వస్తున్నాయి. గర్భాశయ కేన్సర్‌తో(cervical cancer) పూనమ్‌ పాండే మరణించారని పూనమ్‌ పాండే రియల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. వివాదాస్పద నటిగా పేరొందిన పూనమ్‌ పాండే వయసు 32 ఏళ్లే! ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం రాశారంటే 'ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. ఈ విషాద సమయంలో ఆమెను గుర్తుచేసుకోవాల్సి ఉంది’ అని తెలిపారు. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఓ జాతీయ మీడియా జర్నలిస్ట్ తెలిపారు. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ బృందం ధృవీకరించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని చెప్పారు. పూనమ్‌ పాండే కెరీర్‌ మోడల్‌గా మొదలయ్యింది. 2013లో వచ్చిన నాషా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించారు.ఆమెకు సోషల్ మీడియాలో విపరీమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Updated On 2 Feb 2024 4:03 AM GMT
Ehatv

Ehatv

Next Story