శిక్షణలో ఉన్న ఓ యువ ఐఏఎస్(IAS Trainees) మామాలు విలాసాలకు అలవాటు పడలేదు.
శిక్షణలో ఉన్న ఓ యువ ఐఏఎస్(IAS Trainees) మామాలు విలాసాలకు అలవాటు పడలేదు. తన నడవడిక సరిగాలేకపోవడంతో ప్రభుత్వం ఆ ఐఏఎస్‌పై బదిలీ వేటు వేసింది. మహారాష్ట్రలో(Maharashtralo) ఈ పరిణామం చోటు చేసుకుంది. మామూలుగా యూపీఎస్సీ(UPSC) కొట్టం సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఈ చాన్స్ అందరికీ దక్కదు. కొన్ని లక్షల మంది పోటీ పడి రాసే యూపీఎస్సీ పరీక్షలు కొట్టం విషయం కాదు. కానీ ఓ యువతి బాగానే కష్టపడింది. ఐఏస్ సాధించింది. ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు కూడా చేపట్టింది. పుణె అసిస్టెంట్ కలెక్టర్‌గా డా.పూజా కేడ్కర్(Dr.Pooja Khedekar) నియామకం జరిగింది. డాక్టర్ పూజా కేడ్కర్.. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రొబిషన్ పీరియడ్‌లో భాగంగా ఆమె ప్రస్తుతం పుణె ట్రైయినీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. .
ఈ క్రమంలోనే తనకు ప్రభుత్వం ఓ కారును కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన కారుపై వీఐపీలు వినియోగించే రెడ్, బ్లూ బల్బులు ఏర్పాటు చేసుకుంది. ఇక కారు ముందు వీఐపీ నెంబర్ ప్లేట్‌తోపాటు మహారాష్ట్ర ప్రభుత్వమంటూ ప్లేట్‌ను కూడా తగిలించింది. తనకు కలెక్టర్ కార్యాలయంలో అధికారిక చాంబర్ ఏర్పాటు చేయడంతోపాటు అందులో తగినంత సిబ్బందిని, ఓ కానిస్టేబుల్‌ను సైతం కేటాయించాలని సీనియర్ అధికారులను కోరింది. ఇంకోవైపు ఆమె తండ్రి గతంలో సివిల్ సర్వెంట్‌గా పని చేశారు. అయితే ఆయన సైతం తన కమార్తె చేసిన డిమాండ్లను అమలు చేయాలని పుణె కలెక్టర్ కార్యాలయంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం.
పుణెలో ఉన్న అదనపు కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో అతని చాంబర్‌ను ఆక్రమించేసింది. అక్కడ ఉన్న నేమ్ బోర్డును తీసేసి తన పేరుతో ఉన్ననేమ్ బోర్డును తగిలించుకుంది. అంతేకాకుండా తన పేరుతో లెటర్ హెడ్‌ను కూడా తయారు చేసుకుంది. దీంతో పూజా కేడ్కర్ ప్రవర్తనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని పుణె జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పూజ వ్యవహారంపై విచారణ చేసిన కలెక్టర్ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమెను వాసిమ్‌కు(wasim) బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడ ఆమె సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తారని ఆదేశాలు వచ్చాయి.