సల్మాన్‌ఖాన్‌(Salmaan khan) హీరోగా 1995లో వచ్చిన వీర్గతి(Virgati) సినిమా గుర్తుందా? ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది కానీ అందులో హీరోయిన్‌ పూజా దద్వాల్‌(Pooja Dadwal) మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతకు ముందు ఆమె జీనే నహీ దూంగీ(Jine nahi dhungi) అనే సినిమాలో నటించింది కానీ అదేమంత పేరు తెచ్చిపెట్టలేదు. చేసిన రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో టీవీలో ట్రై చేసింది. టీవీ సీరియల్స్‌లో పేరు తెచ్చుకుంటే సినిమా అవకాశాలు వాటంతట అవే వస్తాయని నమ్మింది.

సల్మాన్‌ఖాన్‌(Salmaan khan) హీరోగా 1995లో వచ్చిన వీర్గతి(Virgati) సినిమా గుర్తుందా? ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది కానీ అందులో హీరోయిన్‌ పూజా దద్వాల్‌(Pooja Dadwal) మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతకు ముందు ఆమె జీనే నహీ దూంగీ(Jine nahi dhungi) అనే సినిమాలో నటించింది కానీ అదేమంత పేరు తెచ్చిపెట్టలేదు. చేసిన రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో టీవీలో ట్రై చేసింది. టీవీ సీరియల్స్‌లో పేరు తెచ్చుకుంటే సినిమా అవకాశాలు వాటంతట అవే వస్తాయని నమ్మింది. టీవీ సీరియల్స్ ఆమె కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసింది కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది పూజా దద్వాల్‌. ఇక లాభం లేదనుకుంది. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. భర్తతో గోవాలో స్థిరపడింది. మంచివారికే దేవుడు పరీక్షలు పెడతాడు. ఆమె జీవితం హాయిగా ఆనందంగా సాగుతున్న సమయంలో ఓ రోజు ఆకస్మాత్తుగా కిందపడిపోయింది. జనరల్ వీక్‌నెస్‌ కాబోలనుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లకు డౌట్‌ వచ్చి పరీక్షలు జరిపారు. అందులో ఓ భయంకర నిజం తెలిసింది. ఆమెకు టీబీ(Tuberculosis) సోకింది. పూజకు క్షయ అని తెలియగానే భర్త, అత్త మామలు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. కన్నవారు కూడా ఆమెను పట్టించుకోలేదు. స్నేహితులు దగ్గరకు రావడానికి కూడా భయపడ్డారు. ఎవరూ ఆమెకు కాకుండా పోయారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆ సమయంలో దర్శకుడు రాజేంద్ర సింగ్‌ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. తన మొదటి హీరో సల్మాన్‌ఖాన్‌ను అడిగితే సాయం చేస్తాడేమోనని అనుకుంది. ప్రస్తుతం తన దగ్గర టీ తాగడానికి కూడా డబ్బుల్లేవని, సల్మాన్‌ సాయం చేస్తే బాగుంటుందని చెబుతూ ఓ వీడియో చేసింది. ఎలాగైతేనేం ఆ వీడియో సల్మాన్‌కు చేరింది. ఆమె పరిస్థితి చూసి సల్మాన్‌ చలించిపోయాడు. వెంటనే తన ఫౌండేషన్‌కు వివరాలు చెప్పాడు. ఆమెకు ఆహారం బట్టలతో పాటు చికిత్స ఖర్చులు కూడా అందించాడు. సల్మాన్‌ అందించిన అండదండలతో ఆమె అయిదు నెలల్లోనే పూర్తిగా కోలుకుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుప్రతి నుంచి బయటకు వచ్చింది. వస్తున్నప్పుడు తాను బతికి ఉండటానికి కారణం సల్మాన్‌ ఖానేనని, ఆయనకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని చెప్పింది. ఆయన చేసిన సహాయం మర్చిపోలేనని భావోద్వేగానికి గురయ్యింది. తర్వాత ముంబాయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చిన్న గదిని అద్దెకు తీసుకుంది. బతుకుతెరువు కోసం ఎన్నో పనులు చేసింది. నాలుగేళ్ల కిందట షుక్రానా: గురునానక్‌ దేవ్‌జీ అనే పంజాబీ సినిమాలో నటించింది. అది కూడా బాక్సాఫీసు దగ్గర చతికిలపడింది. దాంతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన రాజేంద్రసింగ్‌ ఓ టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకోమని సూచించాడు. టిఫిన్ సెంటర్‌కు కావాల్సిన సామాగ్రిని రాజేంద్ర సింగే కొనిచ్చాడు(Rajendra singh). ఇప్పుడా మాజీ హీరోయిన్‌ అదే అద్దె ఇంట్లో ఉంటూ టిఫిన్‌ సెంటర్‌ను నడిపిస్తోంది. బతకడానికి సరిపడా డబ్బులు సంపాదిస్తోంది.

Updated On 20 March 2024 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story