కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్‌(congress) ఘన విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్(Exit polls) తప్పని నిరూపించింది. ఒకట్రెండు సంస్థలు మినహా మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ హంగ్‌ అసెంబ్లీనే అన్నాయి. కానీ వారి అంచనాలను భిన్నంగా కాంగ్రెస్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. రాహుల్‌గాంధీ(Rahul Gandhi) భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని కలిగించిన మాట వాస్తవమే.

కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్‌(congress) ఘన విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్(Exit polls) తప్పని నిరూపించింది. ఒకట్రెండు సంస్థలు మినహా మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ హంగ్‌ అసెంబ్లీనే అన్నాయి. కానీ వారి అంచనాలను భిన్నంగా కాంగ్రెస్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. రాహుల్‌గాంధీ(Rahul Gandhi) భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని కలిగించిన మాట వాస్తవమే. అదే సమయంలో బీజేపీ(BJP) పరిపాలనపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి కూడా కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. బీజేపీ ఎత్తుకున్న జై బజ్‌రంగ్‌బలి నినాదాన్ని సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. మోదీ సుదీర్ఘ రోడ్డు షో కూడా ఓట్లు రాల్చలేదు. వీటితో పాటు సునీల్‌ కనుగోలు వ్యూహరచన కాంగ్రెస్‌ విక్టరీకి దోహదపడింది.

కాంగ్రెస్‌పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్‌(Sunil) కనుగోలు పార్టీ ప్రణాళికలను జనాల ముందుకు తీసుకెళ్లడంలో సక్సెసయ్యారు. గత ఎనిమిది నెలలలో కాంగ్రెస్‌ అయిదు సర్వేలను జరిపింది.. ఈ సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసింది. కీలకమైన 70 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని వ్యూహాలకు పదును పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో ఓ పరిశీలకుడిని నియమించుకుంది. సరిగ్గా ఏడాది కిందట, అంటే నిరుడు మేలో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2024 లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల టాస్క్‌ఫోర్స్‌లో సునీల్‌ కనుగోలును నియమించారు. ఈ బృందంలో కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలలతో పాటు పి.చిదంబరం, ముకుల్‌ వాస్నిక్‌, జైరామ్‌ రమేశ్‌, కె.సి.వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌, ప్రియాంక గాంధీ ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ప్రశాంత్‌ కిశోర్‌ విముఖత చూపించిన కొన్ని వారాలకే సునీల్‌ కనుగోలు కాంగ్రెస్‌లో భాగమయ్యారు. సునీల్‌ కూడా ఒకప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌లో ఉన్నవారే! కాకపోతే ఇద్దరూ భిన్నమైనవారు! వీరి కార్యనిర్వహణ విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రశాంత్‌లా సునీల్‌ సోషల్‌ మీడియాకు అంత ప్రాధాన్యతనివ్వరు. పీకే టీమ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2106లో తమిళనాడు ఎన్నికలకు ముందు డీఎంకే నేత ఎమ్‌.కె.స్టాలిన్‌ దగ్గర పని చేశారు. నమక్కు నామే అన్న ప్రచారాన్ని రూపొందించింది సునీలే! ఈ నినాదం చాలా పాపులరయ్యింది. అయితే విపక్షాల ఓట్లు చీలిపోవడంతో అప్పుడు అన్నా డీఎంకే విజయం సాధించింది. కాకపోతే స్టాలిన్‌ ప్రతిష్ట బాగా పెరిగింది. నాయకుడిగా స్టాలిన్‌ ఎదగడానికి ఆ నినాదం దోహదపడింది.

ఆ తర్వాత 2018లో అమిత్‌ షా దగ్గర చేరారు సునీల్‌. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి తోడునీడగా నిలిచారు. విజయవంతమైన ప్రచారాలను రూపొందించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సునీల్‌ కనుగోలు మళ్లీ డీఎంకే శిబిరానికి వచ్చారు. 39 లోక్‌సభ స్థానాలలో డీఎంకే కూటమికి 38 స్థానాలు రావడంలో దోహదపడ్డారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ప్రశాంత్‌ కిశోర్‌ సాయం కోరారు డీఎంకే అధినేత స్టాలిన్‌. దాంతో సునీల్‌ అన్నా డీఎంకే పంచన చేరాల్సి వచ్చింది. కాకపోతే అన్నా డీఎంకేను అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అదే ఏడాది సునీల్‌ కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీ, రాహల్‌గాంధీలను కలుసుకున్నారు.

కర్ణాటకలో వ్యూహకర్తగా సునీల్‌ను నియమించుకుంది కాంగ్రెస్‌. సునీల్‌కు తన పరిమితులేమిటో తనకు తెలుసు. గెలుపోటములకు పొంగిపోయే రకం కాదు. ఎన్నికల వ్యూహకర్త అయిన సునీల్‌ ఎప్పుడూ ఆర్భాటాలకు పోరు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల రూపకల్పనలో కూడా సునీల్‌ పాత్ర కూడా ఉంది. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీ ఇవ్వడం. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తామని మాట ఇవ్వడం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా 10 కిలోల చొప్పున బియ్యం.

నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి. డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువ నిధి పథకం ద్వారా ప్రతి నెల 15 వందల రూపాయలు. 18-25 ఏళ్ల మధ్య వయస్కులకే ఇది వర్తిస్తుంది. శక్తి పథకం కింద మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ పథకాలు కాంగ్రెస్‌ విజయానికి ఎంతో ఉపయోగపడ్డాయి.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ కూడా సునీల్‌ కనుగోలు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్‌ వ్యూహాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగలుగుతాయా? బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యూహాల ముందు సునీల్‌ వ్యూహాలు పని చేస్తాయా? అన్నది చూడాలి.

Updated On 13 May 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story